‘నీ వల్ల నా బతుకు బుగ్గిపాలైందిరా..’ పట్టపగలు HDFC బ్యాంకు ఉద్యోగిని కత్తితో పొడిచిన మాజీ ఉద్యోగి
పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం ఆ బ్యాంకు కస్టమర్లతో కిటకిటలాడుతుంది. ఇంతలో ఓ వ్యక్తి కస్టమర్ అని చెప్పుకొని బ్యాంకులో ప్రవేశించాడు. అనంతరం ఓ బ్యాంకు ఉద్యోగి వద్దకు నేరుగా వెళ్లాడు. బ్యాంకు పని మీదనే వచ్చాడనే అందరూ అనుకున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి జేబులోంచి పదునైన కత్తి తీసి ఎదురుగా ఉన్న బ్యాంకు ఉద్యోగిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఊహించని ఘటనతో అంతా భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు..
చెన్నై, డిసెంబర్ 19: కస్టమర్లతో కిటకిటలాడుతున్న ఓ ప్రైవేట్ బ్యాంకులోకి ఓ అంగతకుడు ప్రవేశించాడు. అనంతరం బ్యాంకు పనిమీదని చెప్పి.. ఓ బ్యాంకు ఉద్యోగి దగ్గరవకు వెళ్లి మాటకలిపాడు. అనంతరం అప్పటికే తనతోపాటు తెచ్చుకున్న కత్తిని జేబులో నుంచి తీసి బ్యాంకు ఉద్యోగిని పొడిచాడు. దీంతో అక్కడి కస్టమర్లు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. చెన్నైలోని టి.నగర్‌లోని బుర్కిత్ రోడ్డులో నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ ప్రైవేట్ బ్యాంకులో ఈ సంఘటన జరిగింది.
చెన్నై టి.నగర్ పక్కన బుర్కిట్ రోడ్డులో నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోకి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సతీష్ అనే వ్యక్తి బ్యాంకు కస్టమర్ నంటూ వచ్చాడు. అనంతరం అతడు నేరుగా బ్యాంకు ఉద్యోగి దినేష్ వద్దకు వెళ్లాడు. అనంతరం తనతోపాటు తెచ్చుకున్న కత్తితీసి దినేష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో దినేష్ చెవికి బలమైన గాయమై రక్తస్రావమైంది. అనంతరం నిందితుడు సతీష్ అన్న మాటలు బ్యాంకు సిబ్బందితోపాటు అక్కడి కష్టమర్లు కూడా షాక్‌తో వింటూ ఉండిపోయారు. ‘నీ వల్ల నా జీవితం నాశనమైంది. నిన్ను ఊరికే వదిలి పెట్టను’ అంటూ సతీష్ బ్యాంకులోనే అందరి ముందూ దినేష్‌ను బెదిరించాడు. ఇంతలో బ్యాంకులో ఉన్న ఇతర సిబ్బంది, కస్టమర్లు ధైర్యం చేసి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో సతీష్ పుదుకోట్టై జిల్లా శాండల్‌మెల్ గుడికి చెందినవాడని తేలింది.
బ్యాంకు ఉద్యోగి దినేష్ పై దాడి చేసిన వ్యక్తి పేరు సతీష్. అతను కూడా మాజీ బ్యాంకు ఉద్యోగి. సతీష్, దినేష్ గతంలో 2 సంవత్సరాలకుపైగా చెన్నైలోని నందనం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో సతీష్ అక్రమాలకు పాల్పడ్డాడన్న నెపంతో ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. అనతంరం ఆ బ్యాంకు నుంచి డి.నగర్ ప్రాంతంలో పనిచేస్తున్న బ్యాంకుకు దినేష్ బదిలీ అయ్యారు. తన జాబ్ పోవడానికి దినేష్ కారణమని భావించిన సతీష్ ప్రతీకారం కోసం ఎదురు చూశాడు. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న సతీస్‌కి వేరే ఉద్యోగం దొరకకపోవడంతో దినేష్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. దీంతో గత రెండేళ్లుగా దినేష్ పని ప్రదేశం కోసం సతీష్ చాలా చోట్ల వెతికాడు. చివరిగా దినేష్ డి.నగర్ లో పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో అతడు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నుంచి కత్తిని కొనుగోలు చేసి రైలులో చెన్నైకి వచ్చాడు. కొన్ని నెలలుగా దినేష్‌పై నిఘా పెట్టిన సతీష్.. గురువారం దాడికి పాల్పడ్డాడు. బ్యాంకు ఉద్యోగిపై దాడి ఘటన నేపథ్యంలో చెన్నైలోని బ్యాంకులన్నింటికీ ఈరోజు సెలవు ప్రకటించారు.
Source: In Chennai An ex-employee who slashed an hdfc bank employee with a knife