Women Psychology: లైఫ్‌లో హ్యాపీగాలేని అమ్మాయిల ప్రవర్తన ఇలా ఉంటుంది.. ఇట్టే కనిపెట్టొచ్చు! ఎలాగంటే

మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేక పుస్తకం. ఇక అమ్మాయిల విషయానికొస్తే వారిని అర్ధం చేసుకోవడం అంత సులువుకాదు. ఎందుకంటే కొందరు జలజలపారే నదుల్లా కిలకిల నవ్వులతో సవ్వడి చేస్తుంటారు. కానీ వారి జీవితంలో అంతులేని విషాదం ఉంటుంది. నలుగురిలో ఇది బయటపడకుండా ఉండేందుకు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తారు. కొందరు ఎల్లప్పుడూ ముభావంగా ఉంటారు. వీరి లైఫ్ లో ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ నలుగురిలో కలవరు..

Women Psychology: లైఫ్‌లో హ్యాపీగాలేని అమ్మాయిల ప్రవర్తన ఇలా ఉంటుంది.. ఇట్టే కనిపెట్టొచ్చు! ఎలాగంటే
Signs A Woman Secretly Unhappy In Life
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 19, 2024 | 8:01 PM

చాలా మంది అమ్మాయిలు జీవిత పోరాటంలో గెలకలేక ముందే తమ ఓటమిని అంగీకరిస్తుంటారు. వీరు తమ జీవితంలో ఎలాంటి కోరికలు, ఆకాంక్షలు కలిగి ఉండరు. దీంతో ఎలాగోలా జీవితాన్ని సాగదీస్తుంటారు. జీవితంలో సంతోషంగా, తృప్తిగా లేరని వారు నోరు తెరచి చెప్పకపోయినప్పటికీ, వారి ప్రవర్తన ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారాలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే.. ఇలాంటి అమ్మాయిలో తమ లైఫ్‌లో ఎంతో అసంతృప్తితో ఉన్నారని అర్ధం చేసుకోవాలి. అలాంటి వారికి భావోద్వేగ మద్దతు అందిస్తే ఆ దశను దాటి వారు కూడా ఆనందలోకాలకు విహరిస్తారు. ఇలాంటి వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే..

మితిమీరిన స్వీయ విమర్శ

జీవితంలో సంతోషంగా, ఒంటరిగా ఉన్నట్లు భావించే అమ్మాయిలు తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు. ఇతరులకు కనిపించక పోయినా ఆమె నిరంతరం తనను తాను తిట్టుకుంటూ.. కుంచించుకుపోతూ ఉంటుంది. తన స్వంత చర్యలు లేదా నిర్ణయాలలో ఎల్లప్పుడూ తప్పును వెతుక్కుంటూ లోలోపల విమర్శిస్తూ, విసుక్కుంటూ ఉంటారు.

సంతోషంగా ఉన్నట్లు నటించడం

సంతోషంగా ఉన్నామనే ముసుగు వేసుకుని జీవించడం అమ్మాయిలకు కొత్తేం కాదు. చాలా మంది తమ జీవితాల్లో సంతోషంగా లేకపోయినా, ఒంటరితనం వేదించినా తమ నిజమైన భావాలను దాచడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో వారు హాస్యాస్పదంగాలేని చిన్నపాటి జోకులకు కూడా విపరీతంగా నవ్వే ప్రవర్తన వీరిలో కనిపిస్తుంది. అందరి ముందు నేను సంతోషంగా ఉన్నాను అని చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇది అసంతృప్తి సంకేతాలలో ఒకటి.

ఇవి కూడా చదవండి

ప్రతికూల పదాలు మాట్లాడటం

ఒంటరిగా, లోన్లీగా భావించే అమ్మాయిలు తరచుగా తమను తాము చెడుగా విమర్శించుకుంటూ ఉంటారు. అందరి ముందు కాన్ఫిడెంట్‌గా ఉన్నా, తానేమీ చేయలేనని, తనకు యోగ్యత లేదనీ.. ఇలా ఎన్నో ప్రతికూల భావాలు వారి మనసులో వ్యక్తమవుతుంటాయి. ఇది మానసిక ప్రశాంతతను పాడుచేయడమే కాకుండా డిప్రెషన్‌కు దారి తీస్తుంది.

అతిగా స్పందించడం

జీవితంలో అసంతృప్తి కలిగిన అమ్మాయిల్లో ఎప్పుడూ తీవ్రమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. వీరి జీవితంలో బాధ్యతలు, సంబంధాలు సంతోషం కంటే భారంగా అనిపిస్తాయి.

అభిరుచులపై ఆసక్తి కోల్పోవడం

తన జీవితంలో సంతోషం లేదని భావించే అమ్మాయిలు తాము లైఫ్‌లో ఏ విజయాన్ని సాధించాలని అనుకోరు. అంతేకాదు వారికి ఇష్టమైన హాబీలపై ఆసక్తి కోల్పోతారు. శ్రద్ధగా, ఆసక్తితో చేస్తున్న పనిపై కూడా ఆసక్తి కోల్పోవడం అసంతృప్తికి సంకేతం. ఈ విషయం చెప్పకపోయినా అది వారి పనిలో కనిపిస్తుంది.

ఆహారం తీసుకోవడంలో మార్పులు

ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పు కనిపిస్తాయి. ఇది వారు మానసికంగా అనారోగ్యంతో ఉన్నారని సూచిస్తుంది. శారీరక ఆకలి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఏదో ఆలోచిస్తూ సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

స్వీయ సంరక్షణ లేకపోవడం

సంతోషంగా లేనప్పుడు, వారు తమ స్వంత శ్రేయస్సు గురించి తక్కువ శ్రద్ధ చూపుతారు. భోజనం, స్నాక్స్ సరిగ్గా తీసుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపకపోవడం, నిద్రపోకపోవడం వంటి వివిధ రకాల ప్రవర్తనలు వీరిలో కనిపిస్తాయి.

ప్రియమైన వారిని దూరంగా ఉంచడం

ఏ అమ్మాయి అయినా తన జీవితంలో సంతోషంగా లేనప్పుడు, అప్పటి వరకు తనతో ఫ్రెండ్‌షిప్‌ చేసిన వారి నుంచి అకారణంగా వైదొలగుతుంది. ఇలా ప్రియమైనవారి నుండి వైదొలగడం ప్రారంభించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆ అమ్మాయిలు లైఫ్‌లో హ్యాపీగా లేరని అర్ధం. ఇతరుల సానుభూతి నుంచి తనను తాను రక్షించుకోవడానికి, తన సమస్యలను ఇతరులపై భారం వేయకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి అమ్మాయిలు ఈ నిర్ణయం తీసుకుంటారు.

మీ చుట్టూ ఉండే వారిలో ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు కనిపిస్తే.. వారిని నిర్లక్ష్యం చేయకండి. వారితో కాసేపు నవ్వుతూ మాట్లాడి, కొంత సమయం వారితో గడిపితే సరి. వారిలో గూడుకట్టుకున్న దిగులంతా మాయమై పోతుంది. నిజానికి, ఇలాంటి వారిని అర్ధం చేసుకోవడం అంత సులువుకాదు. వీరి స్నేహం చాలా అమూల్యమైనది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.