AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Drinking: ఆరోగ్యానికి మంచిదని.. మీరూ నిలబడి పాలు తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా

పాలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పాలు ఏ విధంగా తాగాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది పాలల్లోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందాలంటే తప్పనిసరిగా నిలబడి మాత్రమే తాగాలి అని చెబుతుంటారు. దీనిలో అసలు నిజమెంతుందో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Milk Drinking: ఆరోగ్యానికి మంచిదని.. మీరూ నిలబడి పాలు తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
Milk Drinking
Srilakshmi C
|

Updated on: Dec 19, 2024 | 7:54 PM

Share

రోజూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. పాలు శరీరానికి అనేక రకాల పోషకాలను అందించడమే కాకుండా వ్యాధులను నివారించే శక్తి కూడా కలిగి ఉంటుంది. అయితే పాల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే నిలబడి పాలు తాగడం మంచిదని కొందరి చెబుతుంటారు. నిలబడి పాలు తాగితే పోషకాలు దండిగా అందుతాయనేది కొందరి భావన. అసలు దీనిలో నిజమెంతుందో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి.. ఈ విధంగా పాలు తాగడం వల్ల శరీరానికి అదనంగా ఎలాంటి పోషకాలు అందవు. ఇది పూర్తి అబద్ధమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిలబడి పాలు తాగితే ఎక్కువ పోషకాలు లభిస్తుందన్న సమాచారం పూర్తిగా నిరాధారమని అంటున్నారు. మరైతే నిలబడి పాలు ఎందుకు తాగాలి.. ఇలా ఎందుకు అందరూ చెబుతుంటారు అనేది అసలు ప్రశ్న. ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి పాలు బాగా చేరి దానిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు అన్ని పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. కానీ కూర్చుని పాలు తాగడం స్పీడ్ బ్రేకర్‌గా పనిచేస్తుంది. పాలు పోషకాల ప్రక్రియ ప్రతి భాగానికి చేరుకోవడం నెమ్మదిగా ఉంటుందనే అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఏ ఆహార పదార్థమైనా కూర్చొని తినడం లేదా తాగడం వల్ల బాగా గ్రహిస్తుందని అంటున్నారు. అలాగే ఆహారం బాగా జీర్ణం అవుతుందట కూడా.

నిలబడి పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఖచ్చితంగా నష్టం కలిగిస్తుంది. పైగా అన్నవాహిక దిగువ భాగంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో కూడా నిలబడి పాలు తాగడం నిషేధం. ఇది వాపు, నొప్పిని కలిగించవచ్చు. కాబట్టి నిదానంగా కూర్చుని పాలు తాగడం మంచిది. దీంతో పాలు బాగా జీర్ణమై పోషకాలు బాగా అందుతాయి. కూర్చొని పాలు తాగడమనేది శరీరానికి మంచి మార్గం.

ఇవి కూడా చదవండి

పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి..

  • పాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు తగ్గుతాయి.
  • పాలు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. ఎముకల వ్యాధులను నివారించవచ్చు.
  • పాలు శరీరానికి ఐరన్ కూడా అందిస్తాయి. రక్త సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది.
  • ఎగ్జిమా, సోరియాసిస్, ఇతర ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోజూ పాలు తాగే వారికి ఇలాంటి వ్యాధులు దరిచేరవు.
  • వృద్ధాప్యం శరీరాన్ని శాసించదు. నిత్యం పాలు తాగే వారికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయి. పాల ద్వారా చర్మ కణాలకు తగినంత తేమ అందుతుంది. కాబట్టి ముడతల సమస్య ఉండదు.
  • శరీరం ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు దేశీ పాలు తాగాలి. ఇవి శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే ఈ పాలలో పెద్దగా కొవ్వు కూడా ఉండదు.
  • పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏ ఇన్ఫెక్షన్‌తోనైనా పోరాడగలరు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.