AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: చలికాలంలో 5 రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా..

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్‌లో మన శరీరానికి శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో చలికాలంలో రోజూ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహా ఏమిటంటే

Dry Fruits: చలికాలంలో 5 రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా..
Winter Tips
Surya Kala
|

Updated on: Dec 19, 2024 | 6:26 PM

Share

చలికాలం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం శరీరం వెచ్చగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ తింటారు. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ , ఫైబర్‌తో సహా అన్ని పోషకాలు లభిస్తాయి. అయితే చలికాలంలో రోజూ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తింటే.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వంటి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ అంటున్నారు. డ్రై ఫ్రూట్‌లు వేడిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత తినడం మంచిది. రోజూ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో నిపుణుల ద్వారా తెలుసుకుందాం..

ఆరోగ్యానికి మేలు చేస్తాయి

డ్రై ఫ్రూట్స్ శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్లు , మినరల్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాదు ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుండె, ఒత్తిడికి మేలు

డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. పండ్లలో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. దీంతో గుండె పని సామర్థ్యం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలను గుర్తుంచుకోండి

డ్రై ఫ్రూట్స్ కూడా కొందరికి హాని కలిగిస్తాయి. ఎవరికైనా మధుమేహం సమస్య ఉంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినకూడదు. డ్రై ఫ్రూట్స్‌లో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి సులభంగా బరువు పెరుగుతాయి. ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలంటే మొదట్లోనే వాటిని తింటే అలర్జీ ఉందా లేదా అనే విషయంపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే కొంతమందికి ఇవి అలెర్జీని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో సమతుల్య పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)