AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya: సోమవతి అమావాస్య రోజున ఈ వస్తువులు దానం చేయండి.. పితృదోషం నుంచి ఉపశమనం పొందుతారు

సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం విడవడం, పిండ ప్రదానం వంటి శ్రద్ధ కర్మలతో పాటు పుణ్యనదులలో స్నానం చేయడం, దానం చేయడం విశిష్టత కలిగి ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానం చేయడం ద్వారా తన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందుతాడు. పితృదోషం నుంచి కూడా విముక్తి పొందుతాడు.

Somvati Amavasya: సోమవతి అమావాస్య రోజున ఈ వస్తువులు దానం చేయండి.. పితృదోషం నుంచి ఉపశమనం పొందుతారు
Somvati Amavasya 2024
Surya Kala
|

Updated on: Dec 19, 2024 | 5:15 PM

Share

హిందూ మత విశ్వాసాల ప్రకారం అవసరమైన వారికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దానం చేసిన వ్యక్తులు పుణ్యఫలితాలను పొందుతాడు. హిందూ మతంలో, పౌర్ణమి, అమావాస్య తిథిలలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతే కాదు సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రార్ధ కర్మలను నిర్వహించి, నైవేద్యాలు సమర్పించడం వలన పూర్వీకులు ప్రసన్నులవుతారు, అలాగే ఈ రోజున పుణ్యస్నానం చేసి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం వచ్చింది.

ఏ వస్తువులను దానం చేయాలంటే

నల్ల నువ్వుల దానం: సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, అశుభ శక్తుల నుంచి రక్షించ మంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు. సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పితృ దోషం తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.

బట్టలు దానం: సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల పిండదానం చేసిన తర్వాత..వారిని స్మరించుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమని కోరుకోవాలి. పూర్వీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి. ధోతి, పంచ, చొక్కా మొదలైన వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. వారి ఆశీర్వాదాలను వ్యక్తికి అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏడు రకాల ధాన్యాలను దానం

సోమవతి అమావాస్య రోజున 7 రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో బియ్యం, గోధుమలు, మినుములు, నల్ల శనగలు, తెల్ల నువ్వులు, పెసలు, మొక్కజొన్న లేదా కాయధాన్యాలు మొదలైనవి ఉన్నాయి. ఇందులో బియ్యం శుభప్రదంగానూ, గోధుమలను జీవితానికి ఆధారం గానూ పరిగణిస్తారు. వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం.

అమావాస్య తిథి రోజున చేసే స్నానం, దానం ప్రాముఖ్యత

మార్గశిర మాసం అంటే సంవత్సరంలో చివరి అమావాస్య తిధి సోమవారం కావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. సోమవతి అమావాస్య రోజున శివుడిని, పార్వతిని పూజించడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు సోమవతి అమావాస్య రోజున పుణ్యస్నానం చేసి పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.