- Telugu News Photo Gallery Spiritual photos India Famous Temples where no place for fashion, strict dress code, ban on wearing jeans, skirts
Temples Dress Code: భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో డ్రెస్ కోడ్.. జీన్స్, టీ షర్ట్, షర్ట్స్ ధరిస్తే నో ఎంట్రీ
భారతదేశం అనేక పురాతన, అందమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దేశంలోని వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. అయితే భారతదేశంలో చాలా దేవాలయాలలో భక్తులు ధరించే దుస్తుల విషయంలో కొన్ని నియమ నిబంధనలున్నాయి. ఈ ఆలయాల్లో నిబంధనల ప్రకారం దుస్తులు ధరిస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కనుక దేశంలోని డ్రెస్ కోడ్ ఉన్న ప్రముఖ ఆలయాలు ఏమిటి.. ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
Updated on: Dec 19, 2024 | 4:02 PM

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో చాలా అందమైన, విశిష్టత గలిగిన పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు అందంగా ఉండటమే కాదు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాలకు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. అయితే దర్శనానికి వెళ్ళే భక్తులు ధరించే దుస్తుల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్న దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవాలంటే ఆ డ్రెస్ కోడ్ ని అనుసరించాల్సి ఉంది. డ్రస్ కోడ్ వర్తించే భారతదేశంలోని ఫేమస్ ఆలయాలు ఏమిటంటే..

శ్రీ వెంకటేశ్వర ఆలయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఈ దేవాలయం కలియుగ వైకుంఠ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాలి. షార్ట్‌లు లేదా టీ షర్ట్‌లు ధరించి ఇక్కడికి వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించరు. అయితే స్త్రీలు చీర లేదా డ్రెస్ ధరించి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకునే వీలుంది.

గురువాయూర్ కృష్ణ దేవాలయం: ఇది కేరళలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం. ఈ ఆలయంలో డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. ఈ ఆలయంలో పురుషులు సంప్రదాయ లుంగీలు ధరించి మాత్రమే దేవుని దర్శనం చేసుకోవాల్సి ఉంది. అయితే స్త్రీలు చీర లేదా పంజాబీ డ్రెస్ చుడిదార్ లు ధరించి దేవుడి దర్శనానికి వెళ్ళవచ్చు.

మహాబలేశ్వర దేవాలయం: ఇది ప్రసిద్ధ శివాలయం. ఈ ఆలయం కర్ణాటకలో ఉంది. ఈ ఆలయంలో భక్తులు జీన్స్, ప్యాంటు, పైజామా, టోపీ, కోటు, బెర్ముడా ఇలాంటివి ధరించి వెళ్తే భగవంతుని దర్శనం పొందలేరు. ఆలయంలో ఇలాంటి దుస్తులు ధరించడంపై నిషేధం ఉంది. ఆలయంలో శివుని దర్శనం చేసుకోవాలంటే పురుషులు ధోతీ ధరించాలి. అయితే స్త్రీలు చీర లేదా సూట్ ధరించి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.

ఘృష్ణేశ్వర మహాదేవ ఆలయం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం. మహారాష్ట్రలోని సంభాజీ నగర్‌లోని దౌల్తాబాద్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కూడా శివయ్యను దర్శనం చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఇక్కడికి రావాల్సి ఉంది. దేవుడి దర్శనం కోసం పురుషులు తమ పై దుస్తులు అంటే షర్ట్ విప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆలయంలోపలోకి బెల్టు, పర్సు వంటి వాటిని తీసుకెళ్లడంపై కూడా నిషేధం ఉంది.

మహాకాళేశ్వర దేవాలయం: మహాకాళేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ శివుని ఆలయం కూడా12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. మహాకాళుని దర్శనం చేసుకోవడానికి రోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ దేవాలయంలో కూడా డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. ఆలయంలో స్వామివారి జలాభిషేకానికి పురుషులు ధోతీ కుర్తా, స్త్రీలు చీర ధరించాల్సి ఉంది.




