- Telugu News Photo Gallery It is enough to add these foods to make the child's brain active, Check Here is Details
Kids Brain: పిల్లల మెదడును యాక్టీవ్‌గా మార్చాలంటే ఈ ఫుడ్స్ పెడితే చాలు..
చిన్న పిల్లల బ్రెయిన్ ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిలబస్‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అనేక సవాళ్లతో పోరాడే శక్తి పిల్లల బ్రెయిన్‌కి ఉండేలా చూసుకోవాలి. మనకు ఇంట్లోనే సులభంగా లభించే ఫుడ్స్‌తోనే పిల్లల బ్రెయిన్‌ని యాక్టివ్ చేయవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూసేయండి..
Updated on: Dec 19, 2024 | 5:56 PM

బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉంటేనే ఏదైనా చేయగలం. ముఖ్యంగా చిన్న పిల్లలు బ్రెయిన్ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల మెదడుపై ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. చదువులు పెరుగుతున్నాయి కాబట్టి.. అవన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టం. కాబట్టి పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా, జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవాలి.

ఈ లక్షణాలన్నీ కనిపిస్తే మెదడుకు సంబంధించిన సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీనికి వైద్య పరిభాషలో దీనిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే మెదడు లోపల పొగమంచు అని అర్థం. నిజానికి, మెదడులో శీతాకాలంలో మాదిరి పొగమంచు ఉంటుందని దాని అర్ధం కాదు. మెదడుకు ఓ ముసుగులాంటిది అడ్డుపడుతుందని అర్ధం.

పుదీనా కూడా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ వ్యవస్థను క్లీన్‌గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా బ్రెయిన్ డెవల్మెంట్‌కు కూడా సహాయ పడుతుంది. పిల్లలకు పుదీనాతో తయారుచేసిన ఆహారాన్ని ఇచ్చినా, పుదీనా వాసన చూపించినా చాలా మంచిది.

సోంపును కూడా మనం తరచూ ఆహారంలో వాడుతూ ఉంటాం. ఈ సోంపు కూడా ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా మెదడును చురుకుగా మార్చడంలో సహాయ పడుతుంది. పిల్లలకు నేరుగా సోంపు తినడానికి అందించండి. ఇతర ఆహారల్లో కూడా కలిపి ఇస్తే మంచిది.

పసుపు కూడా పిల్లలకు చురుకుగా, బ్రెయిన్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి పిల్లలకు పసుపు కలిపిన ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. పసుపు కలిపిన పాలు, నీళ్లు ఇస్తూ ఉండండి.




