- Telugu News Photo Gallery Stomach pain caused by gas can be reduced with these tips, Check Here is Details
Gas Pain: గ్యాస్ వల్ల పొట్ట నొప్పి వస్తుందా.. ఈ టిప్స్‌తో పరార్!
గ్యాస్ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్ అసిడిటీకి దారి తీస్తుంది. కాబట్టి తరచుగా మీరు గ్యాస్ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. అప్పుడప్పుడు వచ్చే గ్యాస్ నొప్పికి అయితే ఇంట్లోనే ఇప్పుడు చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి..
Updated on: Dec 19, 2024 | 7:46 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. గ్యాస్ వల్ల పైన పొట్ట పట్టేసి.. బాగా నొప్పిగా ఉంటుంది. ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. గ్యాస్ నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఈ సారి ఇలా చేయండి.

పుదీనాతో కూడా మనం గ్యాస్ సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. పుదీనా ఆకులు నమిలి తిన్నా, పుదీనా రసాన్ని నేరుగా తాగినా, మజ్జిగలో కలిపి తీసుకున్నా గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

లవంగం నూనెతో కూడా గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. లవంగం నూనె వాసన చూసినా.. గోరు వెచ్చని నీటిలో కొన్ని లవంగం చుక్కలు కలిపి తాగినా గ్యాస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

సెలెరీ గింజలతో కూడా మనం గ్యాస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. సెలెరీ గింజలు మనకు మార్కెట్లో కూడా లభిస్తాయి. ఇవి కూడా నొప్పిని తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. గోరు వెచ్చని నీటిలో వీటిని మరిగించి ఆ నీటిని తాగవచ్చు.

ధనియాలు, జీలకర్రతో కూడా గ్యాస్ నొప్పిని తగ్గించుకోవచ్చు. కొన్ని ధనియాలు, జీలకర్ర వేసి నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని ఆరారగా తాగుతూ ఉంటే గ్యాస్ వచ్చే నొప్పి తగ్గుతుంది.




