కావ్య కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది.
ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఒక్కసారిగా వెండితెరకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.
తరువాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ గా మారి తన క్యూట్ ఫోటోలతో అందరిమనసులను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
తన ట్రెండీ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెల్ల మెల్లగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్లి ప్రెజెంట్ యూత్ క్రష్ మారింది కావ్య కళ్యాణ్ రామ్.
సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హారర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది.
ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు.