AP Rains: ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. తాజా వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. అల్పపీడన ప్రభావంతో రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన ప్రాంతాల్లో..

Ravi Kiran

|

Updated on: Dec 19, 2024 | 8:47 PM

నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుంది. దాదాపు వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటలు నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి వెళ్లే ఛాన్స్ ఉంది.

1 / 5
డిసెంబర్20, శుక్రవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

2 / 5
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

3 / 5
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు.

4 / 5
ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులతో పాటు.. దక్షిణ కోస్తాలోని మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది విశాఖ తుఫాన్ కేంద్రం.

5 / 5
Follow us