అమ్మబాబోయ్.. బలగం బ్యూటీ బీభత్సం..! కుర్రాళ్ళకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కావ్య
బలగం సినిమా మంచి విజయాన్ని అందుకున్నా ఈ చిన్నదానికి మాత్రం అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. శ్రీ సింహ హీరోగా నటించిన ఉస్తాద్ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటో షూట్స్ తో కాలం గడిపేస్తుంది.
Kavya
Follow us
చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కావ్య కళ్యాణ్ రామ్.
‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ చదువుపై దృష్టి పెట్టింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది . హారర్ నేపథ్యంలో తెరకెక్కిన మసూద సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత బలగం సినిమాతో మరో హిట్ అందుకుంది.