Andhra News: బంకులో పెట్రోల్ కొడుతుండగా ఊహించని ఘటన.. ఓరీ ఆజాము లాగేతరో అంటూ పరుగులు తీసిన సిబ్బంది
బంకులో పెట్రోల్ కొడుతుండగా ఊహించని ఘటన జరిగింది. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని పాత జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంకులోని ఆయిల్ కొట్టే పైపులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు మిషన్‌కి వ్యాపించాయి. దీంతో సిబ్బంది అలర్ట్ అయి పరుగులు తీశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని పాత జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది.పెట్రోల్ బంకులోని ఆయిల్ కొట్టే పైపులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు మిషన్‌కి వ్యాపించాయి. మంటలు అధికంగా వ్యాపించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. మంటలు అధికం కావడంతో అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఆయిల్ ట్యాంక్‌లకు విస్తరించవచ్ఛన్న అనుమానంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు మరింతగా విస్తరించకుండా అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి