సినిమాల్లో వెనకబడ్డ క్యూట్ బ్యూటీ కృతి.. గ్లామర్ మాత్రం తగ్గేదేలే.!
Anil Kumar
19 December 2024
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుందీ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత కూడా శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకుందీ అందాల తార.
అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కృతి శెట్టి. ఇప్పుడు మెల్లి మెల్లిగా మళ్లీ బిజీ అవుతోంది.
కాగా ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందమైన ట్యాలెంటెడ్ హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరని చెప్పవచ్చు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృతి శెట్టి తన స్కిన్ కేర్ రొటీన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. అవేంటంటే..
'నేను చిన్నప్పుడు ‘హౌ టు బి గార్జియస్’ అనే బుక్ కొన్నాను. ఈ పుస్తకం చదవడం ద్వారా అందం మీద శ్రద్ద పెరిగింది' అని చెప్పుకొచ్చింది కృతి.
రోజూ ముఖాన్ని శుభ్రపరచడం, ఉదయాన్నే సన్‌స్క్రీన్ అప్లై చేయడం నా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంటోందీ మంగళూరు ముద్దుగుమ్మ.
అలాగే కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..