తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఎండలు బాబోయ్ ఎండలు..
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్నిప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.. చాలా ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయిని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.అటు తెలంగాణలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, హనుమకొండలో ఎండ మండిపోతోంది. ఖమ్మంలో 40 డిగ్రీలకు దగ్గర్లో ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లోనూ 37 డిగ్రీలు దాటేస్తోంది ఎండ. తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే 125 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?
ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
