Champions Trophy: గమనించారా ఫ్యాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ 5 అరుదైన విషయాలు?
Champions Trophy 2013 vs Champions Trophy 2025: 12 ఏళ్ల తర్వాత భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, ఈ సందర్భంలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించిన 5 కీలక విషయాలు.. 2025లోనూ రిపీటయ్యాయి. దీంతో భారత జట్టు విజేతగా నిలిచిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

Champions Trophy 2013 vs Champions Trophy 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు, ఎంఎస్ ధోని కెప్టెన్సీలో, భారత జట్టు 2013 ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి రోహిత్ కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి భారత్ ట్రోఫీని పంచుకుంది. ఫైనల్ గురించి మాట్లాడుకుంటే, న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. నెమ్మదిగా ఉండే దుబాయ్ పిచ్‌పై ఇది మంచి టోటలే. కెప్టెన్ రోహిత్ ముందుండి నాయకత్వం వహించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. 76 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
2013, 2015 ఛాంపియన్స్ ట్రోఫీ మధ్య ఉన్న 5 సారూప్యతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
5. ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్..
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం స్పష్టంగా కనిపించింది. వెస్టిండీస్‌పై జడేజా 36 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. 2025 లో ఈ పని వరుణ్ చక్రవర్తి చేశాడు. కివీస్ జట్టుపై అతను 42 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
4. స్పిన్నర్ల మాయాజాలం..
రెండు టోర్నమెంట్లలో స్పిన్నర్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. 2013లో, రవీంద్ర జడేజా ఐదు మ్యాచ్‌ల్లో 12.83 సగటు, 3.75 ఎకానమీ రేటుతో 12 వికెట్లు పడగొట్టడం ద్వారా టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో, 2025 టోర్నమెంట్‌లో, వరుణ్ చక్రవర్తి స్పిన్ బ్యాట్స్‌మెన్‌లను చాలా ఇబ్బంది పెట్టింది. అతను మూడు మ్యాచ్‌ల్లో 15.11 సగటు, 4.53 ఎకానమీతో 9 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
3. టోర్నమెంట్ రెండు సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు..
2013 లో, భారత బ్యాట్స్ మెన్స్ మొత్తం టోర్నమెంట్లో 2 సెంచరీలు సాధించారు. ఈ రెండు సెంచరీలు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై భారత మాజీ బ్యాట్స్ మాన్ శిఖర్ ధావన్ బ్యాట్ నుంచి వచ్చాయి. 2025లో, గ్రూప్ దశలోని మొదటి మ్యాచ్‌లో, శుభ్‌మాన్ గిల్ బంగ్లాదేశ్‌పై తన బ్యాట్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మరోవైపు, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌పై అజేయంగా నిలిచి అద్భుతమైన సెంచరీ సాధించి భారతదేశానికి విజయాన్ని అందించాడు.
2. రెండు సార్లు పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఓటమి..
గ్రూప్ దశలో రెండు సార్లు భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. 2013లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా సవరించిన లక్ష్యాన్ని ఛేదించడానికి 22 ఓవర్లలో 8 వికెట్లు మిగిలి ఉండగా.. 102 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.
2025లో మరోసారి భారత్ మొత్తం పాకిస్తాన్ జట్టును 241 పరుగులకు పెవిలియన్‌కు పంపింది. విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో భారత్ 42.3 ఓవర్లలో 6 వికెట్లు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది.
1. టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన భారత్..
2013, 2025 మధ్య ఉన్న అతిపెద్ద సారూప్యత ఏమిటంటే, టోర్నమెంట్ అంతటా భారత జట్టు అజేయంగా నిలిచింది. 2013లో, భారత్ గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్‌లను, సెమీ-ఫైనల్స్‌లో శ్రీలంకను, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
2025లో, గ్రూప్ దశలో గ్రూప్ Bలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి, సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో కివీస్ జట్టును ఓడించి భారతదేశం ట్రోఫీని గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..