IND vs SL: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా.. లైవ్‌ మ్యాచ్‌లో పుష్ప సీన్ చూపించిన ఆల్‌రౌండర్..

సెలబ్రెటీలను పుష్ప(Pushpa) ఫీవర్ వదలడం లేదు. ఎక్కడో ఓ చోట పుష్ప డైలాగులకో, పుష్ప పాటలకు చిందులేస్తున్నారు...

IND vs SL: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా.. లైవ్‌ మ్యాచ్‌లో పుష్ప సీన్ చూపించిన ఆల్‌రౌండర్..
Jadeja
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 25, 2022 | 7:26 AM

సెలబ్రెటీలను పుష్ప(Pushpa) ఫీవర్ వదలడం లేదు. ఎక్కడో ఓ చోట పుష్ప డైలాగులకో, పుష్ప పాటలకు చిందులేస్తున్నారు. తాజాగా భారత క్రికెటర్ లైవ్ మ్యాచ్‌లో వికెట్ తీసిన తర్వాత పుష్ప సినిమాలోలా తగ్గేదే లే అంటు సంబురాలు చేసుకున్నాడు. గాయం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన రవీంద్ర జడేజా(ravindra jadeja) చాలా ఉత్సాహంగా కనిపించాడు. లక్నోలో భారత శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జడేజా పుష్ప సీన్ చూపించాడు. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్‌(Allu Arjun) లా దగ్గేదే లే అంటూ గడ్డం కిందికెళ్లి చేయిని పైకి లేపాడు. ఇదంతా లైవ్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వికెట్‌ పడగొట్టిన తర్వాత తగ్గేదే లే అంటూ పుష్పలాగా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. జడేజా ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దినేష్ చండిమాల్ వికెట్ తీశాడు.

కానీ, ఈ ఒక్క వికెట్ తీసిన తర్వాత అతడు ఏం చేశాడనేది యాక్షన్ హెడ్ లైన్స్‌గా మారింది. ఈ సన్నివేశం మొత్తం శ్రీలంక ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌లో ఉంది. ఈ ఓవర్ రెండో బంతికి, జడేజా చండిమాల్ వికెట్ తీసి, ఆపై పుష్ప పాత్రలోకి ప్రవేశించి సంబరాలు చేసుకున్నాడు. అయితే గతంలో క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో పెట్టి వార్తల్లో నిలిచారు జడేజా. ఫిబ్రవరి 26న ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 27న అక్కడే మూడో టీ20 కూడా జరగనుంది.

Read Also.. IND vs SL: బ్యాటింగ్‌లో ఇషాన్-శ్రేయాస్‌.. బౌలింగ్‌లో భువీ-వెంకటేష్‌ల దెబ్బకు లంక విలవిల.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!