గొడ్డలితో కర్కశ దాడి.. కుప్పకూలిన దంపతులు.. ఆర్థిక విభేదాలే కారణమా..

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అంశాల్లో తలెత్తే విభేదాలు నిండు జీవితాలను..

గొడ్డలితో కర్కశ దాడి.. కుప్పకూలిన దంపతులు.. ఆర్థిక విభేదాలే కారణమా..
crime news
Follow us

|

Updated on: Feb 25, 2022 | 7:41 AM

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అంశాల్లో తలెత్తే విభేదాలు నిండు జీవితాలను నిలువునా కూలుస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నాయి. తాజాగా భూమి పంపకాలు, గట్టు విషయంలో నెలకొన్న గొడవల్లో సొంత పెదనాన్న, పెద్దమ్మలను కుమారుడి వరసయ్యే వ్యక్తి(Murder) దారుణంగా హత్య చేశాడు. పొలం పనులకు వెళ్లిన వారిపై గొడ్డలితో దాడి(Attack) చేసి అత్యంత కర్కశంగా ప్రాణం తీశాడు. తనకు అన్యాయం చేస్తున్నారని కక్ష గట్టుకుని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని పెద్దపల్లి(Peddapalli) జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో మంచినీళ్ల వెంకటి, అతని భార్య కనకమ్మ లు పొలం పనులు చేస్తూ జీవిస్తున్నారు. వెంకటి, అతని సోదరుడు రాజయ్యలు 4 ఎకరాల చొప్పున భూమిని పంచుకున్నారు. పంపకాలకు ముందు ఉన్న ఉమ్మడి ఆస్తి 20 గుంటల భూమిని వెంకటి ఒక్కడే అమ్ముకున్నాడని, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని రాజయ్య తరచూ వెంకటితో గొడవపడేవాడు.

పంచుకున్న 8 ఎకరాల భూమి పక్కపక్కనే ఉండటం, తన వాటా 4 ఎకరాల భూమిలో కొంత భూమిని వెంకటి అక్రమించుకున్నాడని పొలం సరిహద్దు గట్ల విషయమై అన్నతో తమ్మునికి గొడవలు జరిగాయి. ఈ విషయంపై కొన్నేళ్లుగా అన్నదమ్ములు, వారి కుటుంబాల మధ్య గొడవలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పెదనాన్న, పెద్దమ్మలపై కక్ష పెంచుకున్న రాజయ్య కుమారుడు రవితేజ.. పొలం వద్ద వీరిద్దరినీ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పొలం పనులు చేసేందుకు చేను వద్దకు వెళ్లిన వెంకటి దంపతులు.. భోజనం చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. దాన్ని అదనుగా తీసుకున్న రవితేజ పథకం ప్రకారం వారిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ, తల, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

హత్య జరిగిన స్థలం గ్రామానికి దూరంగా ఉండటంతో హత్య జరిగిన విషయం ఎవరికీ తెలియలేదు. సాయంత్రం గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. వెంకటి తమ్ముడి కుమారుడు రావితేజ ఈ దారుణానికి పాల్పడ్డాడని నిర్ధరించారు. ఆర్థిక విషయాల్లో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు పురిగొల్పాయని వెల్లడించారు.

Also Read

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నంబర్లు..

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. భారత్ వైఖరి వెనుక వ్యూహం ఇదేనా..?

Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో