Pranitha Subhash: అరుదైన గౌరవం అందుకున్న బాపు గారి బొమ్మ.. గర్వంగా ఉందంటూ పోస్ట్‌..

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది  కన్నడ బ్యూటీ ప్రణీత శుభాష్ (Pranitha Subhash). ఆ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో కలిసి 'అత్తారింటికి దారేది'

Pranitha Subhash: అరుదైన గౌరవం అందుకున్న బాపు గారి బొమ్మ.. గర్వంగా ఉందంటూ పోస్ట్‌..
Pranitha Subhash
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2022 | 10:03 AM

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది  కన్నడ బ్యూటీ ప్రణీత శుభాష్ (Pranitha Subhash). ఆ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి రభస చిత్రంలో నటించింది. వీటితో పాటు డైనమైట్‌, బ్రహ్మోత్సవం, హలోగురు ప్రేమకోసమే తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇక కరోనా కాలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు అందుకుందీ ముద్దుగుమ్మ. ఇక సినిమా కెరీర్‌ ఉండగానే గతేడాది మే31న త‌న చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త నితిన్ రాజుతో రహస్యంగా పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచిందీ ముద్దుగుమ్మ. తాజాగా ప్రణీతకు అరుదైన గౌరవం లభించింది. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసా (UAE golden visa)ను అందుకుందీ బాపుగారి బొమ్మ. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా (Social media) లో షేర్‌ చేసుకుంది. గర్వంగా ఉందంటూ పొంగిపోయింది.

కాగా క్రియేటివిటీ, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో అపార సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎంతకాలమైనా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండే వీలుంటుంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ఇండియా నుంచి మొదటగా ఈ వీసానుఅందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సోనూ నిగమ్‌, నేహా కక్కర్‌, మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది. కాగా దక్షిణాదిలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌, ఉపాసన, కాజల్‌ అగర్వాల్‌ ఈ వీసాను అందుకున్నారు. క్రీడా విభాగంలో సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ దంపతులు కూడా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు.

Also Read: Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. భారత్ వైఖరి వెనుక వ్యూహం ఇదేనా..?

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!