AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేశారు.. తెలివితో సంపాదిస్తే తప్పెలా అవుతుందని అతి తెలివి ప్రదర్శించారు.. చివరికి

ఆర్థిక వ్యవహారాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో రోజురోజుకు పెరిపోతున్న నేరాల(Crime)ను చూస్తుంటే ఆందోళన కలగుతోంది. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మే అవకాశం లేకుండా..

కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేశారు.. తెలివితో సంపాదిస్తే తప్పెలా అవుతుందని అతి తెలివి ప్రదర్శించారు.. చివరికి
Representative ImageImage Credit source: TV9 Telugu
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 6:58 AM

Share

ఆర్థిక వ్యవహారాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో రోజురోజుకు పెరిపోతున్న నేరాల(Crime)ను చూస్తుంటే ఆందోళన కలగుతోంది. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మే అవకాశం లేకుండా పోతోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) లో తక్కువ పెట్టుబడితో అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. స్టార్టప్ కంపెనీకు పెట్టుబడులు వచ్చేందుకు మరో సంస్థను తెరిచారు. దాంట్లో తక్కువ పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికారు. ఇలా ఒక్క తెలంగాణలోనే రూ.70కోట్లు సేకరించారు. అయితే ఈ మోసాలకు అతని భార్య కూడా సహకరించడం గమనార్హం. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారికి చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న నగదును ఫ్రీజ్ చేశారు.

కోల్‌కతాకు చెందిన జయంత్‌ బిశ్వాస్‌ కు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేది. రూ.లక్ష పెట్టుబడితో రాజస్థాన్‌లో ఓ స్టార్టప్ ప్రారంభించాడు. కంపెనీలో ఎవరూ భాగస్వాములుగా చేరకపోవడంతో నిధుల సమీకరణ కష్టమైంది. పెట్టుబడి కోసం జయంత్ దంపతులు మరో కొత్త సంస్థ తెరిచారు. కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెడితే.. అధిక లాభాలు ఇస్తామంటూ ఆశ చూపారు. ఏజెంట్ల ద్వారా ఖాతాదారులను ఆకట్టుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేవారు. సంస్థ పట్ల నమ్మకం కలిగేలా చేశాడు. 10-100శాతం వడ్డీలు ఇస్తామంటూ భారీగా డిపాజిట్లు సేకరించారు. కొద్ది సమయంలోనే కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఒక్క తెలంగాణలోనే 3,500 మంది నుంచి రూ.70కోట్లు సేకరించారు. డిపాజిటర్లకు చెప్పినట్లుగానే కొంతకాలం అసలు, వడ్డీలు చెల్లించారు. సంస్థలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్ల సంఖ్య పెరుగుతుండటంతో వారికి తిరిగి చెల్లించటం కష్టంగా మారింది. దీంతో బోర్డు తిప్పేసి పరారయ్యారు.

విషయం తెలుసుకున్న బాధితులు.. పెద్ద ఎత్తున సంస్థ వద్దకు చేరుకున్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈఓడబ్ల్యూ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాడ గుర్తించి బంజారాహిల్స్‌లోని ఖరీదైన హోటల్‌లో ఉన్న జయంత్‌ బిశ్వాస్‌ను గత నెల 31న అరెస్ట్‌ చేశారు. తప్పించుకున్న అతడి భార్య కోసం గాలిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు మాత్రం.. తాను తప్పుచేయలేదని వాదించడం గమనార్హం. తెలివితేటలను పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభిస్తే దాన్ని నేరమని ఎలా అంటారంటూ ప్రశ్నించాడు. నిందితులకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. రూ.8కోట్లు ఫ్రీజ్‌ చేశారు.

Also Read

Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Zodiac Signs: వీరికి అసూయ ఎక్కువ.. ఇతరుల ఆనందాన్ని అస్సలు ఓర్వలేరు..

Viral Video: సుందరానికి తొందరెక్కువ అన్నట్లు.. ఈ మొసలి కూడా తెగ ఆరటపడిపోతోంది.. దేనికోసమో మీరే చూసేయండి..