Bheemla Nayak Movie Release Highlights: థియేటర్లలో భీమ్లా నాయక్‌ దండయాత్ర.. ఫ్యాన్స్ సందడి ఎలా ఉందో చూడండి..

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Feb 25, 2022 | 2:27 PM

Bheemla Nayak: పవన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్‌ థియేటర్లలోకి వచ్చేశాడు...

Bheemla Nayak Movie Release Highlights: థియేటర్లలో భీమ్లా నాయక్‌ దండయాత్ర.. ఫ్యాన్స్ సందడి ఎలా ఉందో చూడండి..
Bheemla Nayak

Bheemla Nayak: పవన్‌ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్‌ థియేటర్లలోకి వచ్చేశాడు. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా ఎట్టకేలకు మంచి సమయం చూసుకొని దూసుకొచ్చాడు భీమ్లా నాయక్‌. వకీల్‌ సాబ్‌ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న చిత్రం కావడం, రానా కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు మాటలు అందించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలు ఈ అంచనాలకు తగ్గట్లు ఉండడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. మరి థియేటర్లలో దండేత్తడానికి సిద్ధమైన భీమ్లా నాయక్‌ చిత్రం ఎలా ఉంది.? థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఎలా ఉంది.? లాంటి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకోసం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Feb 2022 01:52 PM (IST)

    ఫ్యాన్స్‌ హంగామా మాములుగా లేదుగా..

    భీమ్లా నాయక్‌ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో పవన్‌ ఫ్యాన్స్‌ హంగామా మాములుగా లేదు. పవన్‌ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు పేపర్లు విసురుతూ హంగామా చేస్తున్నారు. థియేటర్ల ముందు ఏర్పాటు చేసిన కటౌట్లకు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  • 25 Feb 2022 01:45 PM (IST)

    భీమ్లా నాయక్‌ సక్సెస్‌పై స్పందించిన సంయుక్త..

    విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న భీమ్లా నాయక్‌ సినిమాపై హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మా భీమ్లా నాయక్‌ చిత్రానికి అన్ని చోట్ల నుంచి బ్లాక్‌బస్టర్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. మీ అందరి బ్లెస్సింగ్స్‌కు ధన్యవాదాలు. పవన్‌ కళ్యాణ్‌ సార్‌, రానా సర్‌, లా లా భీమ్లా’ అంటూ రాసుకొచ్చారు.

  • 25 Feb 2022 12:16 PM (IST)

    అన్ని కుట్రలను అదిగమించి భీమ్లా నాయక్‌ విజయాన్ని సాధించాలి: లోకేష్‌

    భీమ్లా నాయక్‌ చిత్రంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘భీమ్ల నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నాను. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు. భీమ్ల నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

  • 25 Feb 2022 12:11 PM (IST)

    భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు..

    భీమ్లా నాయక్‌ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా పలు వరుస ట్వీట్‌లు చేశారు. ‘చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా జగన్ తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

  • 25 Feb 2022 11:09 AM (IST)

    భీమ్లా నాయక్‌ క్రేజ్‌ ఎలా ఉందో చూడండి..

    భీమ్లా నాయక్‌ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్స్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ చేస్తోన్న హంగామా మాములుగా లేదు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంద్యా 35 ఎమ్‌ఎమ్‌లో అభిమానులు ఏకంగా 300 కిలోల పేపర్లను చల్లుతూ రచ్చ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.

  • 25 Feb 2022 11:02 AM (IST)

    కల్ట్‌ మాస్‌ భీమ్లా..

    భీమ్లా నాయక్‌ సినిమాపై చిత్ర సంగీత దర్శకుడు థమన్‌ స్పందించారు. ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్‌ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. ‘కల్ట్‌ మాస్‌ భీమ్లా.. బ్లాక్‌బ్లస్టర్‌ భీమ్లా నాయక్‌’అంటూ రాసుకొచ్చారు థమన్‌.

  • 25 Feb 2022 10:22 AM (IST)

    పవన్‌ కళ్యాణ్‌ సింహ గర్జన..

    భీమ్లా నాయక్‌ చిత్రంపై దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌కల్యాణ్‌ సింహ గర్జన చేశారు. చాలా రోజు తర్వాత థియేటర్‌లలో ఆయన నట గర్జన చూడటం అద్భుతంగా ఉంది. సాగర్‌ కె.చంద్ర, త్రివిక్రమ్‌, నాగవంశీలతో పాటు మొత్తం టీమ్‌కు నా అభినందనలు. తమన్ అందించిన మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బావా… నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా..! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా..! రానా.. నీలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు’ అంటూ ట్వీట్‌ చేశారు..

  • 25 Feb 2022 10:09 AM (IST)

    సినిమాలో హైలెట్స్‌ ఇవేనంటా..

    పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది భీమ్లా నాయక్‌ సినిమా. థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ఫ్యాన్స్‌ సినిమాలోని హైలెట్స్‌ గురించి చెబుతున్నారు. ముఖ్యంగా పవన్‌, రానాల నటనతో పాటు సినిమాకు బ్రాగ్రౌండ్‌ మ్యూజిక్ అద్భుతంగా ఉంది అంటూ చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్‌లు సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అటూ ఫ్యాన్స్‌ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పేరుకు రీమేక్‌ చిత్రమే అయినా మన ఆడియెన్స్‌కు అనుగుణంగా చేర్చిన మార్పులు, చేర్పులతో సినిమా ఓ రేంజ్‌లో ఉందంటూ చెబుతున్నారు.

  • 25 Feb 2022 09:07 AM (IST)

    అమెరికాలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న భీమ్లా..

    అనుకున్నట్లే పవన్‌ కళ్యామ్‌ భీమ్లా నాయక్‌ వసూళ్లు రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 304 లోకేషన్స్‌లో కలిపి రూ. 5 కోట్ల వసూళ్లు రాబట్టింది.

  • 25 Feb 2022 08:30 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా సందడి..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ సందడి మాములుగా లేదు. ఉదయం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సినిమా ప్రీమియర్‌ షోలు పడగా, సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌తో నడుస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ, వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

  • 25 Feb 2022 07:50 AM (IST)

    అమెరికాలోనూ అరాచకం..

    ప్రపంచవ్యాప్తంగా పవన్‌ ఫ్యాన్స్‌ హల్చల్‌ చేస్తున్నారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. లుంగీలు కట్టుకొని థియేటర్లల వద్ద సందడి చేస్తున్నారు. థియేటర్ల ముందు పవన్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి చూస్తుంటే.. ఇది అమెరికా.? లేక అమలాపురమా.? అన్నట్లు అనిపిస్తోంది. హ్యూస్టన్‌ నగరంలో ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి ఎలా ఉందో మీరూ చూడండి..

  • 25 Feb 2022 07:40 AM (IST)

    హైదరాబాద్‌లో బెన్‌ఫిట్‌ షోలు..

    భీమ్లా నాయక్‌ సినిమాకు తెలంగాణలో 5 షోలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదారాబాద్‌లోని పలు థియేటర్లలో బెన్‌ఫిట్‌ షోలకు అనుమతిచ్చారు. భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌లలో అభిమానులు సందడి చేశారు. ఈ బెన్‌ఫిట్‌ షోను భీమ్లా నాయక్‌ నిర్మాత నాగ వంశీ అభిమానులతో కలిసి వీక్షించారు.

  • 25 Feb 2022 07:33 AM (IST)

    థమన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్‌..

    భీమ్లా నాయక్‌ చిత్రంలో పవన్ కళ్యాణ్‌, రానాల నటనకు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో సంగీత దర్శకుడు థమన్‌కు కూడా అంతే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు థమన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమంటూ ఫ్యాన్స్‌ ట్వీట్‌లు చేస్తున్నారు.

  • 25 Feb 2022 07:28 AM (IST)

    ఇదెక్కడి మాస్‌ సెలబ్రేషన్స్‌ మావా..

    పవన్‌ ఫ్యాన్స్‌ సందడి మాములుగా లేదు. తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండుగలా జరుపుకుంటున్నారు. కర్నూలులో ఆటోలతో చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

  • 25 Feb 2022 06:46 AM (IST)

    విదేశాల్లో పవన్‌ క్రేజ్‌ చూస్తే..

    భీమ్లా నాయక్‌ సందడి తెలుగు రాష్ట్రాలకే, భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతా విస్తరించింది. లండన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. బాణా సంచా కలుస్తూ రచ్చ చేస్తున్నారు. ఎర్ర కండువాలను ధరించి ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ లండన్‌లోని థియేటర్ల ముందు హల్చల్‌ చేస్తున్నారు.

  • 25 Feb 2022 06:41 AM (IST)

    భారీ కలెక్షన్లు పక్కా..

    ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతోన్న భీమ్లా నాయక్‌ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకు ఈ సినిమా చేసిన ప్రీరిలీజ్‌ బిజినెస్‌.. ఇప్పటికే ప్రీమియర్స్‌తోనే భీమ్లా భారీగా రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల గ్రాస్‌ రాబట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే మాత్రం.. రికార్డుల మోత మోగినట్లే. ఎందుకంటే ఇప్పట్లో మరే పెద్ద సినిమా లేకపోవడం, శివరాత్రితో లాంగ్‌ వీకెండ్‌ వస్తుండడంతో భీమ్లా నాయక్‌ కలెక్షన్లు భారీగా ఉండనున్నాయి.

  • 25 Feb 2022 06:35 AM (IST)

    భీమ్లా నాయక్‌పై స్పందించిన వెంకటేశ్‌..

    భీమ్లా నాయక్‌ చిత్రంపై ఫ్యాన్స్‌ నుంచి సెలబ్రిటీల వరకు చాలా ఆతృతగా ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేశ్‌ స్పందించారు. ఈ విషయమై వెంకీ ట్వీట్ చేస్తూ.. ‘భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. భీమ్లా నాయక్‌ ప్రోమోలు .. ట్రైలర్లు అద్ధుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో పవన్ .. రానా ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు వెంకీ.

Published On - Feb 25,2022 6:22 AM

Follow us