Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dhanshika : కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న షికారు.. నవ్వులు పూయిస్తున్న ట్రైలర్ ..

నాగేశ్వ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌. ఆర్‌. కుమార్ (బాబ్జీ) నిర్మాత‌గా హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి..

Sai Dhanshika : కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న షికారు.. నవ్వులు పూయిస్తున్న ట్రైలర్ ..
Shikaru
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 25, 2022 | 7:00 AM

Sai Dhanshika : నాగేశ్వ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌. ఆర్‌. కుమార్ (బాబ్జీ) నిర్మాత‌గా హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, ధీర‌జ్ ఆత్రేయ న‌వ‌కాంత్‌, ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌ పై ఈ సినిమా రూపొందింది. శేఖ‌ర్ చంద్ర ఈ సినిమా సంగీతం స‌మ‌కూర్చారు. షికారు ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వి.వి.వినాయ‌క్ చేశారు. ప్ర‌సాద్ లేబ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వినాయ‌క్ మాట్లాడుతూ.. నేను ఆది సినిమా చేసిన‌ప్పుడు రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయ‌న‌కు నా సినిమాపై న‌మ్మ‌కం అలాంటిది జ‌డ్జిమెంట్ బాగా తెలుసు. అప్ప‌టినుంచి ఆయ‌న ప‌రిచ‌యం కొన‌సాగుతోంది అన్నారు. ద‌ర్శ‌కుడు హ‌రి సినిమా చేయ‌డం నిర్మాత‌ను ఒప్పించ‌డం చాలా గొప్ప విష‌యం. ఎందుకంటే నిర్మాత కాంప్ర‌మైజ్ కాడు. క‌థ‌ల‌పై ఆయ‌న ప‌ట్టు అలాంటిది. ఈ సినిమా కూడా మంచివిజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

చ‌మ‌క్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా ట్విస్ట్ ఇచ్చే పాత్ర‌ను పోషించాను. మంచి పాత్ర చేశాను. మంచి టీమ్‌తో ప‌నిచేసినందుకు చాలా ఆనందంగా వుంది. న‌లుగురు కుర్రాళ్ళు చేశారు. ఇంత‌కుముందు హుషారు చేశారు. ఇది మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు. అలాగే సాయి ధ‌న్సిక మాట్లాడుతూ, ర‌జ‌నీకాంత్ కూతురుగా కబాలిలో న‌టించాను. ఆ త‌ర్వాత తెలుగు సినిమాలో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ సినిమా మంచి పాత్ర దొరికింది. ద‌ర్శ‌కుడు నిర్మాత న‌న్ను ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు. అలాగే ద‌ర్శ‌కుడు హరి మాట్లాడుతూ, వినాయ‌క్ గారు వ‌చ్చి ఆశీర్వ‌దించ‌డం చాలా ఆనందంగా వుంది. మంచి యూత్ ఫుల్ సినిమా. ఇలాంటి క‌థ‌లు నేడు రావాలి. ప్రేక్ష‌కుడికి పుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Nithya Menon: నిత్యయవ్వన మకరందం ‘నిత్యామీనన్’.. బూరె బుగ్గల చిన్నదాని నయా ఫొటోస్ అదుర్స్..

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు