Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా న‌టించిన చిత్రం ‘వలిమై’. నేడు రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ... సోషల్​మీడియా ట్రెండింగ్​
Valimai Review
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 24, 2022 | 11:48 AM

Valimai Twitter Review: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా న‌టించిన చిత్రం ‘వలిమై’. నేడు రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. జీ స్టూడియోస్‌తో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ క‌పూర్(Boney Kapoor) ఈ మూవీని నిర్మించగా.. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ చిత్రంలో తెలుగు యాక్టర్  కార్తికేయ(Kartikeya Gummakonda) విల‌న్‌గా న‌టించాడు. హ్యుమా ఖురేషి కీ రోల్ పోషించింది.  ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్​ నటించిన చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా అంచనాలను అందుకున్నట్లే సోషల్ మీడియా టాక్‌ని బట్టి తెలుస్తుంది. మూవీ చూసిన అభిమానులంతా సినిమా సూపర్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా సినిమాకు ప్రధాన బలాలు అని చెబుతున్నారు. అజిత్​ యాక్టింగ్, హీరో క్యారెక్టరైజేషన్​, కార్తికేయ నటన​ సూపర్ అని పేర్కొంటున్నారు. బ్యాగ్రౌండ్​ మ్యూజిక్‌కి మంచి స్పందన వస్తుంది.  క్లైమాక్స్​ అద్భుతంగా ఉందని మూవీ చూసినవాళ్లు చెబుతున్నారు. సినిమా ర‌న్ టైమ్ మూడు గంట‌లు ఉండ‌టం అనేది ఒక బ్యాక్ డ్రాప్ అని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఫస్టాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ కాస్త వీక్ అన్నది ఇప్పటివరకు అందుతున్న సమాచారం. అజిత్ ఫ్యాన్స్ హడావిడితో థియేటర్ల వద్ద పండుగ శోభ కనిపిస్తుంది.

Also Read: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?

తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?