27 April 2025

మరోసారి ఆ స్టార్ హీరో సరసన అనుపమ.. ఈసారి రచ్చే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్‏గా మారింది అనుపమ.

శతమానం భవతి సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైన అనుపమ.. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను, యూత్‏ను కట్టిపడేసింది. 

ఆ తర్వాత యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. 

కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది అనుపమ. ప్రస్తుతం ఆమె కేవలం పరదా అనే తెలుగు సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు టాక్. 

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఆమె మరోసారి హీరో శర్వానంద్ సరసన కనిపించనున్నట్లు సమాచారం

డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

అయితే ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుందని టాక్. శతమానం భవతి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న రెండో సినిమా ఇది. 

ఇదిలా ఉంటే.. విక్రమ్ చియాన్ తనయుడు ధృవ్ విక్రమ్ తో అనుపమ ప్రేమలో ఉందంటూ టాక్ నడుస్తుంది. ఇటీవలే వీరిద్దిరి ఫోటో నెట్టింట హల్చల్ అయ్యింది.