27 April 2025
రామాయణంలో సీత పాత్రను నేను వదులుకోలేదు.. శ్రీనిధి శెట్టి..
Rajitha Chanti
Pic credit - Instagram
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి.
ఈ సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగుతోపాటు కన్నడ, తమిళంలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
కేజీఎఫ్ చిత్రాల తర్వాత విక్రమ్ చియాన్ సరసన కోబ్రా చిత్రంలో నటించింది. ప్రస్తుతం నాని జోడిగా హిట్ 3 చిత్రంలో నటిస్తుంది.
మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. దీంతో ప్రమోషన్లలో నానితో కలిసి సందడి చేస్తుంది.
హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో సీత పాత్ర కోసం తాను అడిషన్ ఇచ్చినట్లు వెల్లడించింది.
ఈ సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవి, అలియా భట్ వంటి పెద్ద పేర్ల మధ్యలో తనకు అడిషన్ కాల్ రావడమే గొప్ప అని తెలిపింది.
అడిషన్ తర్వాత తనకు మళ్లీ ఫోన్ రాలేదని.. ఆ పాత్రకు అలియా భట్ అని ప్రచారం విన్నానని కానీ సాయి పల్లవి తీసుకున్నారని తెలిపింది.
ప్రస్తుతం తాను తెలుగులో హిట్ 3తోపాటు సిద్దు జొన్నలగడ్డ జోడిగా తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్