'వారిని చాలా బాధ పెట్టాను.. జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా'
27 April 2025
Basha Shek
కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతి హాసన్. అయితే ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది.
కానీ ఆ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుని గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలున్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడితే పాటు లవ్, బ్రేకప్, రిలేషన్ షిప్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది శ్రుతి హాసన్.
మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో డేటింగ్ చేసింది
అయితే ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు. ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు చాలా బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదు'
'ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటాన. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది'
'మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి' అని చెబుతోంది శ్రుతి హాసన్.
ఇక్కడ క్లిక్ చేయండి..