Hyderabad Metro Trains: నేడు మెట్రో రైళ్ల రద్దు వార్తలపై స్పందించిన ఎండీ.. ఏమన్నారంటే..
Hyderabad Metro Trains: హైదరాబాద్ మహానగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఆదివారం (జులై3) పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లు నిలిపివేస్తారనే
Hyderabad Metro Trains: హైదరాబాద్ మహానగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఆదివారం (జులై3) పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లు నిలిపివేస్తారనే ప్రచారం జరిగింది. వీటిపై స్పందించిన అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎప్పటిలాగానే ఆదివారం కూడా సాధారణంగానే మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయమని, రైళ్లను నిలిపివేయబోమని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజూ కొనసాగనున్నాయి. ఈ మీటింగ్ తర్వాత పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుంది. మోడీ ఈ సభకు హాజరై బీజేపీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈక్రమంలోనే ఆదివారం మెట్రో రైళ్లను రద్దు చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. దీంతో మెట్రో రైలు ఎండీ స్పందించారు. అదేం లేదని.. యథావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టంచేశారు.
ఇక ఆదివారం 34 ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..