Telangana Congress: రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన జగ్గారెడ్డి.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ..

Telangana Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తామేమైనా..

Telangana Congress: రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన జగ్గారెడ్డి.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ..
Jaggareddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 02, 2022 | 8:26 PM

Telangana Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తామేమైనా నౌకర్లమా? అని ప్రశ్నించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘ఎవర్ని కొడతావ్.. ఎందుకు కొడతావ్.. కోపమున్న వాడివి నువ్వు పీసీసీ పదవికి ఏం పనికొస్తావ్? విహెచ్ ను ఎవరు అని ఎలా అంటావ్? ఎవరిని బండకేసి కొడతావో చెప్పాలి. చిన్న పిల్లల వ్యవహారం లాగ ఉందా? రేవంత్.. ఆ పదవి దిగిపోతే నీకు వ్యాల్యూ కూడా ఉండదు. హనుమంతరావు వయసు ఎంత నీ వయసెంత? కాంగ్రెస్ పార్టీ ఏమైనా నీ సొంతమా? ఒక పీఏసీ మీటింగ్ లేదు, స్టేట్ ఎక్సక్లూటివ్ మీటింగ్ లేదు, ఇంట్లో కూర్చుంటే అయిపోతోందా? ఈ విషయంపై హైకమాండ్‌కి లేఖ రాస్తా. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రేవంత్ రెడ్డి పీసీసీ ఎంతమాత్రం సరిపోడు.’’ అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

ఇదే సమయంలో యశ్వంత్ సిన్హాకు వ్యతిరేకంగా మాట్లాడటంపైనా జగ్గారెడ్డి స్పందించారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ అధిష్టానమే ఎన్నుకుందని, రాహుల్ గాంధీకే లేని అభ్యంతరం ఇక్కడి పీసీసీ చీఫ్‌కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నామినేషన్ రోజు రాహుల్ గాంధీ పక్కన కేటీఆర్ కూడా ఉన్నాడని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పీసీసీ సీఎల్పీ కలిసి యశ్వంత్ సిన్హాని ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు జగ్గారెడ్డి. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు.

పీసీసీ ఆహ్వానించకపోయినా.. యశ్వంత్ సిన్హాను హనుమంతరావు ఆహ్వనించాడని, ఆయన వెళ్లడంలో ఏం తప్పు లేదని అన్నారు. విపక్షాల రాష్టప్రతి అభ్యర్థిగా సిన్హా ఉన్నారని, రాహుల్ గాంధీ పక్కన కూర్చుని నామినేషన్ వెయించారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. సిన్హా ని కలువొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడా చెప్పలేదని, పార్టీ పరంగా ఆ చర్చనే జరగలేదన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. బీజేపీకి మంచి బుద్ధి కల్పించమని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరతానని అన్నారు. బీజేపీ పెద్ద డ్రామా పార్టీలా మారిందని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.