AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి సేవలు..

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సిబి మధ్య గురువారం ఐపిఎల్ మ్యాచ్ జరుగనుంది. దీని కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి మించి రైళ్లు నడుస్తాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.

Hyderabad: మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి సేవలు..
Hyderabad Metro
Srikar T
|

Updated on: Apr 24, 2024 | 5:20 PM

Share

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సిబి మధ్య గురువారం ఐపిఎల్ మ్యాచ్ జరుగనుంది. దీని కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి మించి రైళ్లు నడుస్తాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. క్రీడా అభిమానుల కోసం మెట్రో సేవలను నిరంతరాయంగా కల్పించేందుకు సిద్దమైంది మెట్రో రైలు సంస్థ. సాధారణంగా రాత్రి 10.30 వరకు మాత్రమే నడిచే చివరి రైలు సమయంలో కీలక మార్పులు చేసింది. రాత్రి 12:15 గంటలకు అన్ని మెట్రో టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరి గమ్యస్థానాలకు 1:10 కి చేరుకుంటాయని ప్రకటించింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ ఈ మూడు మెట్రో స్టేషన్‌లలో షెడ్యూల్ అవర్స్‌కి మించి ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఇతర స్టేషన్లలో కేవలం రైలు నుంచి బయటకు వచ్చేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ టీం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. SRH మొదటి నాలుగు స్థానాల్లో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి RCBతో తలపడే మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇక గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మరో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఉప్పల్ స్టేడియంలో తలబడే టీంలు..

  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ (RR)
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs గుజరాత్ టైటాన్స్ (GT)
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs పంజాబ్ కింగ్స్ (PK)

తొలి మ్యాచ్ మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో జరగగా, ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..