Watch Video: సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్..

Watch Video: సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్..

Srikar T

|

Updated on: Apr 24, 2024 | 4:06 PM

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై ఫైర్ ఆయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. 100 రోజులు కాస్త 120 రోజులు దాటిందని.. ఎక్కడ పోయింది హామీల గ్యారెంటీ అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై ఫైర్ ఆయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. 100 రోజులు కాస్త 120 రోజులు దాటిందని.. ఎక్కడ పోయింది హామీల గ్యారెంటీ అని ప్రశ్నించారు. అందుకే ఎల్లుండి అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్దకి తాను వస్తానని.. సీఎం రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 15 లోపు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని అమరవీరుల సాక్షిగా రేవంత్ ప్రమాణం చేయాలని కోరారు. ఒకవేళ ఆగస్ట్ 15లోగా అన్ని హామీలను అమలు చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్ళీ తిరిగి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ప్రమాణం చేస్తానన్నారు. ఒకవేళ ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 24, 2024 04:06 PM