Hyderabad: రౌడీషీటర్ల వివరాలు తెలియదా..? సీఐపై సీపీ ఆగ్రహం.. కట్ చేస్తే, ఏమైందో తెలుసా..
ఆయనో స్టేషన్ హౌజ్ ఆఫీసర్.. కానీ, అతని స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై అన్ని తెలుసుండాలి.. అయితే.. ఉన్నతాధికారి రౌడీషీటర్ల వివరాలు అడిగినప్పుడు ఆయన చెప్పలేకపోయారు. దీంతో అతనిపై కమిషనర్ చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ల వివరాలు చెప్పమంటే..

ఆయనో స్టేషన్ హౌజ్ ఆఫీసర్.. కానీ, అతని స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై అన్ని తెలుసుండాలి.. అయితే.. ఉన్నతాధికారి రౌడీషీటర్ల వివరాలు అడిగినప్పుడు ఆయన చెప్పలేకపోయారు. దీంతో అతనిపై కమిషనర్ చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ల వివరాలు చెప్పమంటే తెల్లమొహం వేసిన ఇన్స్పెక్టర్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య బదిలీ వేటు వేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిత్యం రౌడీ షీటర్లు హల్చల్ చేస్తూ ఉండే పోలీస్ స్టేషన్లలో బొరబండ ప్రాంతం ఒకటి.. సౌత్ జోన్ మినహాయిస్తే హైదరాబాద్ వెస్ట్ జోన్‌లోనూ పలువురు రౌడీషీటర్లు అలజడి సృష్టిస్తుంటారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య అన్ని స్టేషన్లను ఆకస్మాత్తుగా సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బొరబండ పోలీస్ స్టేషన్‌ను సీపీ శాండిల్య సందర్శించారు. అయితే, కమిషనర్ వచ్చిన సందర్భంలో బొరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్.. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్‌తో పాటు వీధుల్లో నిర్లక్ష్యం వహించడం కనిపించింది. స్థానికంగా ఉండే రౌడీషీటర్ అడ్రస్ చెప్పాలని సీపీ సందీప్ ఇన్స్పెక్టర్ ను కోరారు. అయితే రౌడీ షీటర్ల వివరాలు తెలపడంలో ఇన్స్పెక్టర్ విఫలమయ్యారు. తాను పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల వివరాలు తెలుపలేకపోవటంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే రౌడీషీటర్ అడ్రస్సులు కూడా తెలియకపోవడం హాస్యాస్పదం అంటూ ఇన్స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లపై స్థానిక ఇన్స్పెక్టర్ ప్రకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈ స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వివాదాస్పదంగా మారింది. పోలీస్ కమిషనర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అడిగినా సదరు ఇన్స్పెక్టర్ దగ్గర సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బొరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య వెంటనే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలాఉంటే.. పలు కేసుల్లో ఇన్స్పెక్టర్ రవికుమార్‌పై అవినీతి ఆరోపణలు సైతం వచ్చాయి. గతంలో ఒక కేసులో మహిళల వేధింపుల కేసును నీరుగార్చాడని అభియోగాలు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి కనుసనల్లోనే పనిచేస్తున్నారని రవికుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఇక పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై సైతం నిర్లక్ష్యంగా అమర్యాదగా వ్యవహరిస్తున్నట్టు గతంలో ఫిర్యాదులు అందినట్లు సమాచారం. తన వ్యవహార శైలి మార్చుకోవాలని గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా.. సీఐ వ్యవహారంలో ఎలాంటి మార్పు లేదని.. అందుకే చర్యలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
