Telangana: ఏఐతో డిజిటల్‌ చెల్లింపులపై ఈసీ నజర్.. వారి ఖాతాలపైనే గురి..!

Telangana: ఏఐతో డిజిటల్‌ చెల్లింపులపై ఈసీ నజర్.. వారి ఖాతాలపైనే గురి..!

Yellender Reddy Ramasagram

| Edited By: Ravi Kiran

Updated on: Oct 24, 2023 | 8:00 PM

Election Commission: డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. రోజువారి లెక్కలను తీసుకుంటున్న ఎన్నికల సంఘం అనుమానిత ఖాతాలపై కన్నేసి పెట్టింది. అనుమానిత అకౌంట్స్ తో పాటు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను వాడుతూ డబ్బుల పంపిణికి బ్రేక్ వేస్తోంది ఈసీ. ఏదైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది ఎలక్షన్ కమిషన్.

డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. రోజువారి లెక్కలను తీసుకుంటున్న ఎన్నికల సంఘం అనుమానిత ఖాతాలపై కన్నేసి పెట్టింది. అనుమానిత అకౌంట్స్ తో పాటు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను వాడుతూ డబ్బుల పంపిణికి బ్రేక్ వేస్తోంది ఈసీ. ఏదైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్రమ డబ్బును కట్టడి చేసేందుకు ఎన్నిరకాల రూట్స్ ఉంటే అన్ని దారులపై నిఘా పెట్టింది ఎన్నికల సంఘం. ఒకవైపు రెగ్యులర్ చెకప్ లలో వందల కోట్ల రూపాయలను స్వాదినం చేసుకుంటూనే మరోవైపు డిజిటల్ లావాడేవిలను మానిటరింగ్ చేస్తోంది. RBI సహకారంతో అక్రమ డబ్బు పంపిణికి చెక్ పెట్టె ప్రయత్నం చేస్తోంది ఈసీ.

వ్యక్తిగత ఖాతాలతో అన్ని రాజకీయ పార్టీల ఖాతాల పై ఈసీ నజర్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఆయా బ్యాంకులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. రోజువారీగా అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు చాలామని అవుతున్న ఖాతా లిస్ట్ ఈసీ కి ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారి తో పాటు ఎన్నికల సంఘానికి లిస్ట్ పంపాలని పేర్కొంది. ఒకే ఖాతా నుంచి లార్జ్ ట్రాంజక్షన్ పై ఓ కన్నేసి పెట్టింది ఈసీ. గూగుల్ పే, ఫోన్ పే లో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశపై ఈసీ సీరియస్ యాక్షన్ అని హేచ్చరిస్తోంది.

ఫోకస్ చేసిన ప్రతి బ్యాంకులో రోజువారీ విత్ డ్రాల ద్వారా జరిగిన లావాదేవీలు,ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పై , మెయిన్ బ్రాంచ్ నుంచి బ్యాంక్ లకు రోజు వెళుతున్న అమౌంట్ వివరాలపై ఈసీ దృష్టి పెట్టింది. ఆన్లైన్, నగదు చెల్లింపు సంస్థల లావాదేవీల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు అధికారులు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపులపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిఘా పెట్టింది ec. లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించి రోజు వారీ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దాంతో రాష్ట్రంలో ఎలాంటి మనీ లాండరింగ్, మద్యం సరఫరా, వస్తువుల పంపిణీని అరికట్టవచ్చని ఈసీ భావిస్తోంది. ఇందుకు తగిన అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. డిజిటల్ హవా నడుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం డిజిటల్ ప్లాట్ ఫామ్ ను నమ్ముకొని డబ్బులు పంపిణి చేస్తున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది ఈసీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..