Minister KTR With Jaya Prakash: అది ఉంటే నరకమే.. జయప్రకాశ్‌ నారాయణ్‌ కీలక వ్యాఖ్యలు

Minister KTR With Jaya Prakash: అది ఉంటే నరకమే.. జయప్రకాశ్‌ నారాయణ్‌ కీలక వ్యాఖ్యలు

Subhash Goud

|

Updated on: Oct 24, 2023 | 8:06 PM

తెలంగాణలో రాజకీయాల హడావుడి కొనసాగుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. తాజాగా.. మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్‌ నారాయణ్‌..

తెలంగాణలో రాజకీయాల హడావుడి కొనసాగుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. తాజాగా.. మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్‌ నారాయణ్‌ సమాధానాలు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు 2009 నుంచి 2014 వరకు ఒకటే శాసనసభలో కలిసి ఉన్నామని, ఆ సమయంలో కొన్ని ఆవేశాలు, కొన్ని సంఘటనలు జరిగాయి.. అందరిలో కోపతాపాలు ఎన్నో ఉండేవి. కానీ మీరు మాత్రం సంయమనం పాటిస్తూ మీరు హుందాగా వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రం విడిపోతే బాగుండ, మరి కొందరేమో విడిపోవద్దని చెప్పుకొచ్చారు. అయితే మీరు ఓ పౌరుడిగా, ఆనాడు మీకున్న అనుమానాలు ఏంటో చెప్పగలరా? తొమ్మిదేళ్ల తర్వాత మీకున్న అనుభావాలను తెలుపాలన్న ప్రశ్నకు జయప్రకాశ్‌ నారాయణ్‌ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రల ఒత్తిడి నా మీద పడినట్లు ఎవ్వరి మీద పడలేదని అభిప్రాయపడుతున్నానని అన్నారు. ఆ రోజుల్లో తెలంగాణలో పర్యటించినప్పుడు జై తెలంగాణ అనేవారని, కొస్తాంధ్రలో వెళితే సమైక్యాంధ్ర అనేవారని అన్నారు. రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్లిని ఈ రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనను అభినందిస్తున్నానని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 24, 2023 08:01 PM