కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర.. రంగంలో అగ్రనేతలు.. ఎప్పటినుంచంటే.?
Telangana Congress: ఇక కాంగ్రెస్ కూడా గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా ఉంది. అటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే.. ఖాళీ దొరికినప్పుడల్లా తెలంగాణను చుట్టేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇటీవలే మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన రాహుల్, ప్రియాంక మళ్లీ రెండో విడత కూడా రాబోతున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారు పార్టీ నేతలు.
ఇక కాంగ్రెస్ కూడా గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా ఉంది. అటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే.. ఖాళీ దొరికినప్పుడల్లా తెలంగాణను చుట్టేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇటీవలే మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన రాహుల్, ప్రియాంక మళ్లీ రెండో విడత కూడా రాబోతున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారు పార్టీ నేతలు. ఈనెల 28నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర మొదలు కానుంది. ఈ నెల 28, 29 తేదీల్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనుండగా.. ఈ నెల 30, 31 తేదీల్లో బస్సు యాత్ర చేయనున్న ప్రియాంక గాంధీ,
నవంబర్ 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో జరగనుంది. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర నిర్వహించనుంది.
మరోవైపు లోకల్ లీడర్స్ సైతం ప్రచారం స్పీడప్ చేశారు. ఠాక్రే, రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ సహా ముఖ్య నేతలంతా రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2రోజుల్లో 10మంది నేతలు, 40 నియోజకవర్గాలు చుట్టేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గ్యారంటీ కార్డులపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయనున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్‌తో రోజల తరబడి లెఫ్ట్ పార్టీల చర్చలు కొనసాగుతున్నాయి. చెన్నూరు, పాలేరు విషయంలో పీఠముడి వీడటంలేదు. పాలేరు, మిర్యాలగూడ కావాల్సిందేనని సీపీఎం నేతలు పట్టుబడుతున్నాయి. అయితే మిర్యాలగూడ, వైరా ఇస్తామంటన్న కాంగ్రెస్ చెప్తోంది. కాంగ్రెస్ ఆఫర్ చేసిన చెన్నూరు స్థానంలో మునుగోడు కోసం సీపీఐ పట్టుబడుతోంది. దీంతో ఇప్పుడప్పుడే పొత్తులు తెగేలా కనిపించడంలేదు. మరోవైపు అసంతృప్తుల బెడద కూడా పార్టీని వెంటాడుతోంది. ఇక రెండో విడత లిస్ట్ వస్తే మరికొంత మంది నేతలు అలకబూనే అవకాశం ఉంది. దీనిపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది హస్తం పార్టీ.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

