AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్‌.. మార్చి 10న నీటి కొరత.. ఏయే ప్రాంతాల్లో తెలుసా..?

ఎండాకాలం మొదలైపోయింది. నీటి ఎద్దడి కూడా మొదలవుతుంది. ఇక హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా అవుతుంది. నగరంలోని చాలా ఇళ్లలో ఇప్పుడే బోర్లలో నీరు అడుగంటిపోతోంది. దీని వల్ల నీటి కొతర సమస్య ఏర్పడుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటిని సరఫరా చేస్తుంది. నమ్మకమైన నీటి సరఫరాకు అలవాటు పడిన హైదరాబాద్‌..

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్‌.. మార్చి 10న నీటి కొరత.. ఏయే ప్రాంతాల్లో తెలుసా..?
Hyderabad Water
Subhash Goud
|

Updated on: Mar 08, 2024 | 1:19 PM

Share

Hyderabad Cut: ఎండాకాలం మొదలైపోయింది. నీటి ఎద్దడి కూడా మొదలవుతుంది. ఇక హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా అవుతుంది. నగరంలోని చాలా ఇళ్లలో ఇప్పుడే బోర్లలో నీరు అడుగంటిపోతోంది. దీని వల్ల నీటి కొతర సమస్య ఏర్పడుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటిని సరఫరా చేస్తుంది. నమ్మకమైన నీటి సరఫరాకు అలవాటు పడిన హైదరాబాద్‌ ప్రస్తుతం జలాశయాల నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమిక నీటి వనరులు, దాని రిజర్వాయర్లు తగ్గిపోతున్నాయి. అయితే తగినంత వర్షపు నీటి సంరక్షణ ప్రయత్నాల కారణంగా భూగర్భజలాలు తక్కువగా ఉన్నాయి. వేసవి నెలలు సమీపిస్తున్న కొద్దీ హైదరాబాద్‌లో నీటి వనరుల సుస్థిరత ముప్పు పొంచి ఉండడంతో మున్ముందు సవాళ్లను ఎదుర్కొంటుందని భావిస్తున్నారు.

నగరం ప్రధాన నీటి వనరులు క్షీణించడంతో ముఖ్యంగా మండుతున్న వేసవి నెలల ముందు నీటి కొరతపై ఆందోళనలు పెద్దవిగా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) సరిగా సంసిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. నీటి ట్యాంకర్ డెలివరీలు ఆలస్యం కావడం, బుకింగ్‌లలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. నివాసితులు, ముఖ్యంగా ఐటీ కారిడార్ సమీపంలో ఉన్నవారు మున్సిపల్ నీటి సరఫరా, ట్యాంకర్ డెలివరీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీరు అందుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో సరైన నీటి అందడం లేదు. దీని వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం వస్తోంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రస్తుతం హైదరాబాద్‌కు రోజుకు 565 మిలియన్ గ్యాలన్లు (MGD) సరఫరా చేస్తోంది. అయితే రాబోయే నెలల్లో అదనంగా 50 ఎంజీడీ కీలకం కానుంది. హైదరాబాద్‌లోని 70 మంచినీటి ఫిల్లింగ్ స్టేషన్‌లు, వాటర్ బోర్డ్ ద్వారా నిర్వహణ కొనసాగుతోంది. ట్యాంకర్‌ల కోసం చాలా కాలం నిరీక్షించే సమయం, నివాసితులు ప్రైవేట్ సరఫరాదారులను కోరడానికి ప్రేరేపిస్తుంది. తెలంగాణ టుడే నివేదిక ప్రకారం.. 5,000 లీటర్ ట్యాంకర్ ధర రూ. 600 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. ఫిల్లింగ్ స్టేషన్ నుండి సుదూర డెలివరీ స్థానాలకు అదనపు ఛార్జీలు ఉంటాయి. అంతేకాకుండా సప్లయర్లు ఇరుకైన రోడ్డు మార్గాలలో ఉన్న నివాసాల కోసం ఆర్డర్‌లను నిరాకరిస్తారు. చిన్న చిన్న గల్లీలలో సరఫరా చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఇరుకైనా రోడ్లు ఉండటంతో ట్యాంకర్‌ వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొంత పెద్దగా ఉన్నా.. బైక్‌లు, కార్లు పార్కింగ్‌ చేస్తుండటంతో ట్యాంకర్‌ వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందిగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

నీటి కొరత ఏయే ప్రాంతాల్లో అంటే..

సియాసత్ డైలీ నివేదిక ప్రకారం.. మార్చి 10, 2024న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్, ఏసీ గార్డ్స్‌తో సహా పలు ప్రాంతాలు తాత్కాలిక నీటి సరఫరా నిలిచిపోనున్నాయి. అదనంగా అదే సమయంలో కొన్ని ప్రాంతాలు నీటి సరఫరాలో అంతరాయాన్ని కూడా ఎదుర్కొంటాయి. ఈ ప్రాంతాల్లో గోకుల్ నగర్, నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకపూల్, సీతారాం బాగ్, గన్‌ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్‌కే భవన్, హిందీ నగర్, ఘోడే-ఖబర్, దోమల్‌గూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, ఎన్‌బీటీ నగర్, నూర్‌నగర్‌లోని కొన్ని ఏరియాలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి