Hyderabad: ఎస్సార్ నగర్‌లో అనుమానాస్పదంగా యువకుడు.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా

డ్రగ్స్ ముఠా ఆటకట్టిస్తున్నారు తెలంగాణ పోలీసులు. డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించిన చిటికలో పట్టేసి.. పెడ్లర్లకు చుక్కలు చూపిస్తు్న్నారు.

Hyderabad: ఎస్సార్ నగర్‌లో అనుమానాస్పదంగా యువకుడు.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా
SR Nagar Police Station
Follow us

|

Updated on: Jul 24, 2024 | 6:25 PM

తెలంగాణలో డ్రగ్స్ ముఠాకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసులు. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేస్తున్నారు టీజీ న్యాబ్. తాజాగా ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠాను టీజీ న్యాబ్, ఎస్‌నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు పోలీసులు. సంజయ్‌ అనే వ్యక్తి నుంచి 16 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చి .. రాజ్‌కుమార్ అనే కన్జ్యూమర్‌కి అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్ పోలీసులు. ఈడ్రగ్స్‌ను మరో 9 మంది కన్జ్యూమర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సంజయ్‌ ఫోన్‌ ద్వారా కాంటాక్ట్స్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. బెంగళూరులో ఉన్న అసదుల్లా కోసం గాలిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు చెప్పారు.

మరోవైపు మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలోను భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు అధికారులు. మూడుచింతలపల్లిలో గోడౌన్‌పై అధికారులు దాడులు చేసి.. 96 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ పట్టుబడిన గోడౌన్‌ ఆస్పిన్ బయోఫార్మాకు చెందినదిగా గుర్తించారు. గోడౌన్ కడారి సతీష్‌రెడ్డి పేరుతో ఉన్నట్లు గుర్తించారు. కడారి సతీష్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు బిలాల్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ తీసుకుంటున్న పలువురి గుర్తింపు పోలీసులు. 44 మంది కస్టమర్లలో పలువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి మరోసారి డ్రగ్‌ టెస్ట్‌ చేసి.. పాజిటివ్ వస్తే విచారించనున్నారు పోలీసులు. నెగిటివ్‌ వస్తే కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు మాదాపూర్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..