Harish Rao: నిర్లక్ష్యం వద్దు.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలి.. మంత్రి హరీష్ రావు పిలుపు

Telangana Children COVID Vaccination: కొవిడ్‌ తగ్గిందన్న నిర్లక్ష్యం తగదన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.

Harish Rao: నిర్లక్ష్యం వద్దు.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలి.. మంత్రి హరీష్ రావు పిలుపు
Harish Rao Launches Covid 19
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 16, 2022 | 5:36 PM

Telangana Children Vaccine: కొవిడ్‌ తగ్గిందన్న నిర్లక్ష్యం తగదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12-14 ఏళ్ల చిన్నారుల కోసం వ్యాక్సినేషన్‌‌ను ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్లో  మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ కరోనా తీవ్రత పూర్తిగా తగ్గలేదని.. అందుకు చైనా, హాంకాంగ్‌, అమెరికాలో కేసుల పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. 12-14ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందివ్వడం ఆనందంగా ఉందన్న మంత్రి.. ఆ టీకా హైదరాబాద్‌ కేంద్రంగా తయారవ్వడం గర్వకారణమన్నారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం టీకాలే (Covid Vaccine) అని అన్నారు. కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు  దేశవ్యాప్తంగా ఇవాళ్టి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్​‌ను ఇవాళ్టి(మార్చి 16) నుంచి అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది.

ఈ వయసు పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో 14.50 లక్షలు ఉండగా.. తెలంగాణలో 17.23 లక్షల మంది చిన్నారు ఉన్నారు. అందిరికీ వ్యాక్సిన్ అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు పూర్తి చేశాయి. టీకా తీసుకోవాలంటే కోవిడ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే టీకా కేంద్రంలో కూడా పొందవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.అలాగే 60 ఏళ్ల దాటిన వారందరూ మార్చి 16 నుంచి ప్రికాషన్ డోసు (బుస్టర్ డోసు) తీసుకునేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి: CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..

Balloon Fish: ఈ ఫిష్ కర్రీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి గురూ.. ఇంకా మరెన్నో షరతులు.. తెలిస్తే ఆహా అనాల్సిందే..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?