Balloon Fish: ఈ ఫిష్ కర్రీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి గురూ.. ఇంకా మరెన్నో షరతులు.. తెలిస్తే ఆహా అనాల్సిందే..!
Balloon Fish Curry: తూర్పు గోదావరి జిల్లాలో చిక్కిన బెలూన్ ఫిష్ కర్రీ.. అందరూ చేయలేరటా. దానికి కూసంత కళాపోషణ కావాలంటున్నారు నిఫుణులు. అదేంటో మీరే చదవండి.
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్పలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి మనిషి ముఖాన్ని పోలిన వెరైటీ బెలూన్ చేప(Balloon Fish) చిక్కింది. అయితే దాని గురించి మరికొన్ని వింత విశేషాలు తెలిశాయి. ప్రపంచంలోనే రెండో విషపూరితమైన ఈ బెలూన్ చేపను.. కర్రీచేయాలంటే అట్టాంటి.. ఇట్టాంటి చెఫ్ లు సరిపోరటా.. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలని నిఫుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరమని నిఫుణులు చెబుతున్నారు. ఇక బెలూన్ చేప జపాన్‌కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’ అని కూడా పిలుస్తారు. ఈ చేపను.. జపాన్‌లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో ఎక్కువగా వండుకుని తింటారని అధికారులు చెబుతున్నారు.
జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారని తెలుస్తుంది. టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప.. శాస్త్రీయ నామం టెట్రాడాన్. ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక నీళ్లలో ఈదే ఈ చేపనుగానీ పట్టుకుంటే.. దాని విశ్వరూపం వెంటనే చూపుతుంది. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఊసరవెళ్లిలా రూపాలు మారుస్తుంది.
ఒక్కసారిగా బంతిలా ఉబ్బుతుంది. చేప కాదులే బంతి అని మనుషులను బురిడి కోట్టించేలా తయారవుతుంది. నీటిలో ఉన్నప్పుడు తనకేదైనా ప్రమాదకరమైన సంకేతాలు ఎదురైతే.. ఇది తన నార్మల్ కండీషన్లోంచి అబ్ నార్మల్ గా తయారవుతుంది. ఇదే మిగతా చేపలకూ దీనికీ ఉన్న తేడా.
అంతేకాదు ఇది తనకు అవసరమైనపుడు గాలి పీల్చుకుని బెలూన్ లా కూడా ఉబ్బగలదు. మిగిలిన చేపలకు ఆ ఫెసిలిటీ లేదు. దీని విషం మనిషిని చంపేంత ప్రమాదకరంగా ఉంటుందని.. కాబట్టి ఇలాంటి చేప మీకు ఎక్కడైనా ఎదురైతే- బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్
Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!