AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ మీటింగ్‌ హాట్‌ హాట్‌గా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఉగాదికి కొత్త మంత్రులు రాబోతుండడంతో.. ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు సీఎం జగన్‌.

AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్
Ys Jagan
Balaraju Goud
|

Updated on: Mar 15, 2022 | 7:15 PM

Share

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ(YSRCPLP) మీటింగ్‌ హాట్‌ హాట్‌గా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రుల(Cabinet Minister)తో పాటు ఎమ్మెల్యే(MLA)లంతా హాజరయ్యారు. ఉగాదికి కొత్త మంత్రులు రాబోతుండడంతో.. ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు సీఎం జగన్‌. అసలు ఈ మీటింగ్‌ సారాంశమే మంత్రుల మార్పు. అదే సమయంలో చాలామందికి పార్టీ బాధ్యతలు అప్పగించే పని చేస్తామన్నారు సీఎం జగన్‌. మూడేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్టును వారికి వివరించారు. మంత్రివర్గం నుంచి పక్కనబెడుతున్నట్లు కాదు… వారికి పార్టీ బాధ్యతలిస్తా.. ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరగకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావు.. పార్టీ పదవుల్లోనూ మహిళలకు సమాన ప్రాధాన్యత. ఇవీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ ఇచ్చిన సందేశం. మంత్రి వర్గ విస్తరణతోపాటు.. వచ్చే రెండేళ్లలో ఏం చేయాలో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు.

రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని గతంలోనే చెప్పానని.. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రుల మార్పుంటుందన్నారు. వైసీపీ అంటేనే.. మీరు, నేను కలిసి నిలబెట్టుకున్న పార్టీ అన్నారు సీఎం జగన్‌. ఇప్పుడు మంత్రుల మార్పు అంటే.. మంత్రివర్గంలోంచి పక్కనపెడుతున్నట్టుకాదన్నారు సీఎం జగన్‌. వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరుగుతుంది.. అదే సమయంలో పార్టీని నడిపించే శక్తి ఉంటుందన్నారు. మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. అని మంత్రులతో చెప్పారు. ఇప్పుడు మంత్రులు పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని.. కొత్త మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుదన్నారు. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల రీషఫులింగ్‌లో కొన్ని కొన్ని మినహాయింపులుంటాయన్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు కచ్చితంగా గడపగడపకు వెళ్లాలన్నారు. ఇంట్లోనే కూర్చుంటాం.. సమస్యలుంటే ప్రజలే వస్తారన్న మైండ్‌ సెట్‌ నుంచి బయటపడాలన్నారు. కనీసం మూడు సార్లు డోర్‌–డోర్‌టు కార్యక్రమం చేయాలన్నారు సీఎం జగన్‌. లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఏప్రిల్‌ 2 ఉగాది రోజున డోర్‌ టు డోర్‌ ప్రారంభమయ్యే కార్యక్రమం నెలరోజుల వరకు జరుగుతుందన్నారు. మే నుంచి ప్రతీ నెలా… కనీసం 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని ఆదేశించారు. ఇక కొత్తగా ఏర్పడే 26 జిల్లాలకూ కొత్త అధ్యక్షులు వస్తారని.. 3–4 జిల్లాలకు కలిపి రీజినల్‌ కో–ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరగకపోతే.. సర్వేల్లో పేర్లు రావని.. అప్పుడు మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తానన్నారు సీఎం.