AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వేగంగా బరువు తగ్గాలా.. అయితే, ఆహారంలో ఈ 5 మసాలా దినుసులు చేర్చండి..

మీరు డైటింగ్, వ్యాయామం చేసిన తర్వాత కూడా బరువు తగ్గకపోతే, ఖచ్చితంగా ఈ మసాలా దినుసులను ఆహారంలో చేర్చుకోండి. వీటితో ఆహారం రుచి పెరగడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.

Health  Tips: వేగంగా బరువు తగ్గాలా.. అయితే, ఆహారంలో ఈ 5 మసాలా దినుసులు చేర్చండి..
Weight Loss
Venkata Chari
|

Updated on: Mar 15, 2022 | 8:58 PM

Share

డైటింగ్, యోగా, వ్యాయామం బరువు తగ్గేందుకు కోసం అంతా ఫాలో చేస్తుంటారు. వీటితోపాటు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా కూడా మీరు ఈజీగా బరువు(Weight Loss) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం తప్పనిసరిగా కొన్ని మసాలా దినుసులను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మసాలా దినుసులు మీ ఆహారం(Food) రుచిని పెంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. డైటింగ్(Diet) సమయంలో చాలా మంది రుచిగా లేని ఆహారాన్ని తింటుంటారు. సుగంధ ద్రవ్యాలు మిమ్మల్ని బరువు కచ్చితంగా తగ్గిస్తాయి. ఈ హెల్తీ హెర్బ్స్, మసాలా దినుసులను ఉపయోగిస్తే, క్రమంగా మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1- జీలకర్ర- జీలకర్రను మన ఇళ్లలో వాడుతూనే ఉంటాం. అయితే బరువు తగ్గడంలో ఇది ఎంతో చక్కగా సహాయపడుతుంది. జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని మారుస్తుంది. ఇందులో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని కూడా తాగవచ్చు. ఇది కాకుండా, జీలకర్రను మజ్జిగలో లేదా పెరుగులో కలిపి తింటే కడుపునకు మేలు చేస్తుంది.

2- దాల్చినచెక్క- శరీరం చక్కెరను ప్రాసెస్ చేయడంలో దాల్చినచెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క చక్కెరను కొవ్వుగా మార్చడాన్ని నిరోధిస్తుంది. దీని కారణంగా ఆహారం నెమ్మదిగా ప్రేగులలోకి చేరుతుంది. దాల్చిన చెక్క వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది.

3- నల్ల మిరియాలు- నల్ల మిరియాలు కొవ్వు కణాల ఏర్పాటు ప్రక్రియను ఆపడంలో సహాయపడతాయి. ఎండుమిర్చి తినడం వల్ల కొవ్వుకు సంబంధించిన సమస్యలు రావు. మీరు జలుబు చేసినప్పుడు బ్లాక్ పెప్పర్ టీ తాగవచ్చు. అంతే కాకుండా, ఆమ్లెట్లు, సలాడ్లు, సూప్‌లలో రుచిని పెంచడానికి నల్ల మిరియాలు కూడా వాడుకోవచ్చు.

4- యాలకులు- యాలకులు జీర్ణక్రియలో చాలా సహాయకారిగా పనిచేస్తాయి. యాలకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది జీవక్రియ చర్యను పెంచుతుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే యాలకులతో టీ చేసుకుని కూడా తాగొచ్చు.

5- పసుపు- కూరగాయలో పసుపు లేకుంటే చాలా కష్టం. పసుపులో పూర్తిగా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. పసుపు తినడం వల్ల శరీరంలో మంటలు తొలగిపోతాయి. పసుపు అనేక రకాల టాక్సిన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే పసుపు జీవక్రియను సాఫీగా చేస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభం చేస్తుంది. చలికాలంలో పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

Also Read: Onion Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!

Mysore Bonda: మైసూర్ బోండా తింటున్నారా.. అయితే ఈ వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...