Onion Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. సాధారణం వంటకాలలో వినియోగించే...
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వైద్య పరంగా ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలున్నాయి. కొందరు ఈ ఉల్లిపాయలను పచ్చిగానే తింటారు కూడా.. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ ఉల్లిపాయను కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదంటున్నారు పోషకాహార నిపుణులు.
ఎవరైనా హైపో గ్లైసీమియా అంటే.. షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయను తినడకూడదట. వీరు ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందట. ఇంకా శరీరంలో విటమిన్ కె అధికంగా ఉన్నవారు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలట. ఎందుకంటే ఉల్లిలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టెలా చేస్తుందట. కనుక శరీరం లోపల రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు. లేదంటే హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తవచ్చంటున్నారు. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఉల్లిపాయను పక్కకు పెట్టడం.. లేదా తక్కువ మొత్తంలో తీసుకోవడం ఉత్తమం.. దీనిలో ఫ్రక్టోజ్ అధికంగా ఉండడంతో గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తాయి.
హృదయ సంబంధ సమస్యలతో ఉన్నవారు కూడా ఉల్లిపాయలకు దూరంగా ఉండడం మంచిది. లేదా మొత్తానికి ఉల్లిపాయను తినడం మానేయడం కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భణీలు కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలను అస్సలు తినకూడదట. పచ్చి ఉల్లిపాయను తింటే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.