Mysore Bonda: మైసూర్ బోండా తింటున్నారా.. అయితే ఈ వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
చాలా మందికి వేడి వేడి మైసూర్ బోండా అంటే ఇష్టం ఉంటుంది. హోటల్‌కు వెళ్లిన వారిలో చాలా వరకు బోండా తింటారు...
చాలా మందికి వేడి వేడి మైసూర్ బోండా అంటే ఇష్టం ఉంటుంది. హోటల్‌కు వెళ్లిన వారిలో చాలా వరకు బోండా తింటారు. అయితే బొండా తినడం మంచిదా కాదా అని చాలా మందికి డౌట్ ఉంది. నిజానికి మైసూర్ బోండా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది బాగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. పెరుగు, మైదాపిండి, బియ్యం పిండి. ఈ మూడింటిని కలిపి చేసేదే మైసూర్ బోండా. మైదా కలిపిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా వీటిని మధుమేహం ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడే వారు మైసూర్ బజ్జీలకు దూరంగా ఉండాలి.
బియ్యం పిండిలో హైకార్బోహైడ్రెట్స్ ఉంటాయి. దీన్ని మైదా పిండితో కలిపి తింటే గుండె జబ్బులతో బాధపడేవారికి సమస్యను కలిగిస్తుంది. అలాగే ఏదైనా డీప్ ఫ్రై చేసి తయారు చేసే పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా మైదాలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ. అది బాడీలో పెరిగే కొద్దీ అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది. బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడి… ఇలాంటి అంశాలన్నీ కలిసి… హైబీపీ వచ్చేలా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు తినకూడదు. తరచూ మైసూర్ బోండాలు తింటూ ఉంటే… పొట్టలో బరువుగా, ఏదో రాయిని మోస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read also.. Banana Side Effects: మీకు అరటిపండ్లంటే ఇష్టమా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..