- Telugu News Photo Gallery Serious Side Effects of Eating Bananas: How Many Bananas Should You Eat per Day?
Banana Side Effects: మీకు అరటిపండ్లంటే ఇష్టమా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Side Effects of Eating Bananas: అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, క్యాలరీలు నిండుగా ఉంటాయి. శరీరంలో తక్షణ శక్తిని నింపడానికి, బరువు తగ్గడానికి చాలా మంది అరటిపండ్లను ఇష్టంగా తింటారు. ఐతే వీటి వల్ల కొన్ని నష్టాలుకూడా లేకపోలేదు. అవేంటంటే..
Updated on: Mar 15, 2022 | 1:21 PM

అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, క్యాలరీలు నిండుగా ఉంటాయి. శరీరంలో తక్షణ శక్తిని నింపడానికి, బరువు తగ్గడానికి చాలా మంది అరటిపండ్లను ఇష్టంగా తింటారు. ఐతే వీటి వల్ల కొన్ని నష్టాలుకూడా లేకపోలేదు. అవేంటంటే..

అరటిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా మందిలో మలబద్ధకం సమస్యకు కారణమౌతుందట. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే బెటర్!

అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇందులో ఉండే సహజ చక్కెర కొవ్వులను తయారు చేస్తుంది. కాబట్టి వీటిని మితంగా తినాలి.

ఉదయాన్నే నిద్ర లేవగానే అరటిపండ్లను ఖాళీ కడుపుతో తిన్నారంటే గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలకు గురికాకతప్పదు. అరటిపండ్లను భోజన సమయంలో తింటే మంచిది.

అరటిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. చాలా మంది తల్లులు తమ పిల్లలకు తరచుగా అరటిపండును తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల దంతాలకు అంతమంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అరటిపండ్లు తినకుండా ఉండాలి. ఒకవేళ అరటిపండ్లను ఎక్కువ మొత్తంలో తిన్నారంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది.




