- Telugu News Photo Gallery Spiritual photos If your facing problems din marriage matter do those things on holi as astro tips in telugu
Holi 2022: పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారా ? హోలీ రోజున ఈ పరిహారాలు చేస్తే అంతా శుభమే..
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వయసు పెరుగుతున్న చాలా మందికి వివాహం కాదు.. ఎన్ని పూజలు.. పరిష్కరాలు చేసిన పెళ్లికి అడ్డంకులు వస్తుంటాయి. అలాంటివారు హోలీ రోజున ఈ పరిహారాలు చేస్తే అంతా శుభమే.
Updated on: Mar 15, 2022 | 1:05 PM

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వయసు పెరుగుతున్న చాలా మందికి వివాహం కాదు.. ఎన్ని పూజలు.. పరిష్కరాలు చేసిన పెళ్లికి అడ్డంకులు వస్తుంటాయి. అలాంటివారు హోలీ రోజున ఈ పరిహారాలు చేస్తే అంతా శుభమే.

హోలీ రోజున ఇంట్లో తులసి చెట్టు లేదా మరేదైన మొక్క నాటండి. ఇది కష్టాలను తొలగిస్తుంది. మొక్కలు నాటడం మంచిది.

హోలీ రోజున రాధా కృష్ణుల ఫోటోలను తీసుకురావాలి. సంపద, శ్రేయస్సు కలుగుతాయి. మన దేశంలో మధురలో హోలీని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

హోలీ రోజున ఇంట్లోకి శ్రీ యంత్రాన్ని తీసుకురావడం చాలా మంచిది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఈరోజున శ్రీ యంత్రాన్ని పూజించడం శుభప్రదం.

వ్యాపారంలో నష్టాలు వచ్చేవారు.. హోలీ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లాలి. హనుమంతుని ముందు ధూపం.. అగర్భత్తి వెలిగించి.. ఓం శ్రీ హనుమంతే నమః అని 108 సార్లు పఠించాలి.. బెల్లం సమర్పించి ప్రసాదంగా పంచాలి.

కోరిన కోరికలు తీరకపోయి ఉంటే.. వింధ్య వాసిని మం చింతిత్ ఫలం.. దేహి దేహి భువనేశ్వరి స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. నవ దుర్గా యంత్రం ముందు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108సార్లు జపించాలి.