Telangana Tenth Exams: తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు.. కొత్త షెడ్యూల్ విడుదల..

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ మార్పు‌తో పదో తరగతి పరీక్షల తేదీలను కూడా మార్చింది రాష్ట్ర విద్యాశాఖ...

Telangana Tenth Exams: తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు.. కొత్త షెడ్యూల్ విడుదల..
Tenth Class Students
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 17, 2022 | 6:47 AM

రెండుసార్లు షెడ్యూల్ మారిన ఇంటర్ పరీక్షలను ఇక మే 6 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. టెన్త్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌లో కూడా మార్పులు జరిగాయి. మే 23 నుంచి 28 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలుత ఇంటర్ బోర్డు పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి నిర్వహించాలని నిర్ణయించి తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత జాతీయస్థాయిలో జరిగే జేఈఈ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. రెండు విడతలుగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టాలని తొలి విడత ఏప్రిల్ 16,17, 18, 19, 20, 21 తేదీల్లో నిర్వహించునున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. అప్పటికే ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ తేదీలను ఖరారు చేయడంతో కొన్ని తేదీలు క్లాష్ అయ్యాయి. చేసేదేమీ లేక ఇంటర్ బోర్డు షెడ్యూల్ ను మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అయితే NTA మళ్లీ జేఈఈ పరీక్షల డేట్స్ రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీలకు మార్చింది. ఈ తేదీలు ఇంటర్ బోర్డు రిలీజ్ చేసిన తేదీలతో క్లాష్ అయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ సవరిస్తూ ఫ్రెష్ గా ఇంటర్ బోర్డు తేదీలను ప్రకటించింది.

మే 6 నుంచి మే 18 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మే 7 నుంచి 19 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. జేఈఈ మెయిన్స్ తేదీలతో క్లాష్ లేకుండా తొలివిడత ముగిసిన తర్వాత ఇంటర్ పరీక్షలు జరిగేలా మార్చారు. రెండో విడత జేఈఈ 24 నుంచి ప్రారంభ కానున్న నేపథ్యంలో విద్యార్థులు దానికి ప్రిపేర్ కావడానికి మరో 5 రోజులు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. రెండోసారి ఇచ్చిన షెడ్యూల్ లోనూ ఒక రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి మరో రోజు జేఈఈకి అటెండ్ అయ్యేలా తేదీలు ఉన్నాయి. కానీ లేటెస్ట్ షెడ్యూల్ లో మాత్రం అసలా గొడవ ఎందుకు అని జేఈఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ ముగిశాకే ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టారు. మళ్లీ జేఈఈ సెకండ్ ఫేజ్ కు అడ్డురాకుండా ముందే ముగించారు. మరో వైపు పదో తరగతి పరీక్షల తేదీలు కూడా మారక తప్పలేదు. మే 23 నుంచి 28 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, పరీక్షల తేదీ మార్పు అనివార్యంగానే జరిగిందని, విద్యార్థులంతా ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ కావాలని ఇంటర్ బోర్డు సూచించింది. మే నెలలో ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు, సరైన ఫుడ్ తీసుకోవాలని సూచించారు.