Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ వచ్చేసింది.
తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్. ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ ఇంటర్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది. JEE పరీక్షల షెడ్యూల్ మారడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయని వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. జేఈఈ పరీక్షలు రాసే విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రెండోసారి మారడం గమనార్హం. ఇదిలా ఉంటే.. Enviornmental Exam ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరగనుండగా… ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.
మరోవైపు JEE మెయిన్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీ-షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య JEEజరగాల్సి ఉంది. కానీ కొత్త షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, మే 4 తేదీల్లో జరగనున్నాయి. కాగా, తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు జరగడంతో పదో తరగతి పరీక్షల తేదీలు కూడా మారింది. మే 23 నుంచి 28 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
TS Intermediate 1st & 2nd Year Time Table 2022#IntermediateTimeTable | #TSInterTimeTable pic.twitter.com/B6nBqYrmRv
— TV9 Telugu (@TV9Telugu) March 16, 2022