CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..

Jagananna Vidya Deevena: సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన పథకం నగదును జమ చేశారు. ఈ సదర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని అన్నారు.

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 16, 2022 | 11:47 AM

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ap cm YS Jagan Mohan Reddy). సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన పథకం నగదును జమ చేశారు.  ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. ఈ సదర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. డబ్బుల సమస్యతో ఏ ఒక్కరూ చదువుకి దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు CM జగన్.

అక్టోబర్‌-డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లు అందిస్తున్నారు. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది ఏపీ ప్రభుత్వం. పాఠశాల విద్య కోసం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 27,706.66 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించింది. ఇది గత సంవత్సర కేటాయింపుల కంటే 12.52 శాతం ఎక్కువగా ఉంది.

ఏ తల్లికీ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లు ఖాతాల్లో నేరుగా రూ. 15 వేల చొప్పున జమ చేస్తోంది. దీని వల్ల ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి: Children Vaccine: తల్లిదండ్రులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా..

Balloon Fish: ఈ ఫిష్ కర్రీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి గురూ.. ఇంకా మరెన్నో షరతులు.. తెలిస్తే ఆహా అనాల్సిందే..!