AP Assembly: అసెంబ్లీని కుదిపేస్తోన్న జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాగా బుధవారం సభ మొదలైనప్పటి నుంచి జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిరసనలు తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని 10 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేల్లో రామ్మోహన్, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్, సాంబశివరావు, ప్రసాద్‌లు ఉన్నారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. నాటుసారా వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని టీడీపీ ఆందోళనలు చేపడుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించారు. మరోవైపు ఈ మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీలో కూడా చర్చకు పట్టుబడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. కాగాబుధవారం ఉదయం సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసనన కొనసాగించారు. దీంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో 10 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ONGC Jobs 2022: CLAT ఆధారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
7 తరాల తర్వాత ఆడపిల్ల.. చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు !!