AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముందు సై అంది.. ఆ తర్వాత కెవ్వుమంది.. కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు.. వీడియో చూస్తే షాకే..

సోషల్ మీడియాలో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోలో లెక్కలేనన్ని వైరల్ అవుతుంటారు... వాటిలో మనసుకు హత్తుకునేవి

Viral Video: ముందు సై అంది.. ఆ తర్వాత కెవ్వుమంది.. కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు.. వీడియో చూస్తే షాకే..
Video
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2022 | 10:41 AM

Share

సోషల్ మీడియాలో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోలో లెక్కలేనన్ని వైరల్ అవుతుంటారు… వాటిలో మనసుకు హత్తుకునేవి కొన్ని ఉండగా.. మరికొన్ని పెదాలపైకి చిరునవ్వును తెప్పిస్తాయి. అలాగే.. వెన్నులో వణుకు పుట్టేంచేవి కొన్ని. అయినా.. ప్రతి వీడియోను చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ వలన చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తున్నాయి. జంతువుల చిలిపి అల్లరి వీడియోస్ చూస్తే మనసు తేలికవుతుంది… అలాగే ఒత్తడి తగ్గుతుంది. అలాంటి ఫన్నీ వీడియోస్ చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల అలాంటి ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో బోలెడన్ని ఉన్నాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బా నవ్వడం మాత్రం ఖాయమండి…

అసలు విషయానికి వస్తే.. ఆ వీడియోలో ఓ నీటి కాలువలో ఉన్న బాతును అక్కడకు వచ్చిన ఓ చిన్న కుక్క పిల్ల తెగ ఇబ్బంది పెడుతుంది. సై అంటే సై అంటూ బాతుతో గొడవకు దిగుతుంది. అంతేకాదు.. బాతు ఎంతో సహనంతో చూస్తున్నా.. ఎదురుగా వెళ్లి మరి రెచ్చగొట్టేసింది.. ఇంకేముంది సహనం కోల్పోయిన ఆ బాతు అమాంతం కుక్కపిల్లపై దాడి చేసింది. కుక్కపిల్ల తలను పట్టుకుని పరిగెత్తించింది. బాతు కోపానికి పాపం ఆ కుక్కపిల్ల విలవిల్లాడింది.. బాతు నుంచి వదిలించుకొని పరుగుపెట్టింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..

Mission Imposible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..

RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్‌ కొట్టేసిన హైకోర్టు..

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..