AP Crime News: ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడని వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబసభ్యుల ఆందోళన

A.Konduru Crime News: ఏపీలోని కృష్ణా జిల్లా ఎ.కొండూరులో విషాదం చోటుచేసుకుంది. కాపు సారా అమ్ముతున్నాడని ఓ గిరిజనుడిని ఎస్పై పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టడంతో

AP Crime News: ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడని వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబసభ్యుల ఆందోళన
Tiruvur
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2022 | 9:49 AM

Krishna district Crime News: ఏపీలోని కృష్ణా జిల్లా ఎ.కొండూరులో విషాదం చోటుచేసుకుంది. కాపు సారా అమ్ముతున్నాడని ఓ గిరిజనుడిని ఎస్పై పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టడంతో ఆ అవమానాన్ని భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. దీంతో కుటుంబసభ్యులు, గిరిజనులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్పైను సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎ.కొండూరు (A.Konduru ) లో గిరిజన తాండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా ఓ కానిస్టేబుల్ సోమవారం రాత్రి రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజి (62) ఇంట్లో దొరికిన సారా ప్యాకెట్లతో అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు.

స్టేషన్లో బాలాజీని ఎస్సై తీవ్రంగా కొట్టడంతో కిందపడిపోయాడని మృతుని కుమారుడు ఆరోపిస్తున్నాడు. తర్వాత మళ్లీ విచక్షణా రహితంగా కొట్టారని.. ఈ అవమానాన్ని భరించలేక మంగళవారం నారికింపాడు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. విషయం తెలిసి అంబులెన్స్ లో విస్సన్నపేటలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ మరణించాడు.

కాగా.. ఆస్పత్రిని నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు విస్సన్నపేట – ఏ.కొండూరు ప్రధాన రహదారిపై రేపూడి తండా వద్ద ఆందోళనకు దిగారు. మతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి రాస్తారోకో నిర్వహించారు. బాలాజీ మతికి కారణమైన ఎస్పై టి శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.

-శివకుమార్, టీవీ9 తెలుగు

Also Read:

AP Crime News: అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తెల్లవారుజామునే మాటువేసి..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. మరో 17 మందికి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..