AP Crime News: అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తెల్లవారుజామునే మాటువేసి..
Chain snatcher: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అభంశుభం తెలియని ఐదు నెలల చిన్నారి మృతి చెందింది.
Chain snatcher: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అభంశుభం తెలియని ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. తెల్లవారుజామున ఇంటి వద్దనే మాటువేసిన దొంగ.. మహిళ మెడలోని బంగారు గొలుసును లాగాడు. ఈ క్రమంలో మహిళ చేతిలోని బిడ్డను వదిలేసింది. దీంతో ఐదు నెలల పసికందు ఇంటి మీద నుంచి పడి మృతి చెందింది. ఈ దారుణ ఘటన కడప (Kadapa district) జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామచంద్రపురంలో ఎండాకాలం కావడంతో ఓ కుటుంబం ఇంటి డాబాపై నిద్రించింది. ఈ క్రమంలో ఇంటి మీద నుంచి తెల్లవారుజామున కిందికి దిగుతున్న సమయంలో భారతి అనే మహిళ మెడలోని బంగారం గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాగాడు.
ఈ సమయంలో మహిళ తన చేతిలోని ఐదు నెలల బిడ్డ జారి కిందపడింది. దీంతో ఐదు నెలల మగ బిడ్డ కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చైన్ స్నాచర్స్ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: